twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శర్వానంద్ 'కో అంటే కోటి' విడుదల తేదీ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్: శర్వానంద్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'కో అంటే కోటి'. ప్రియా ఆనంద్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఆవకాయ బిర్యాని ఫేమ్ అనీష్‌ కురువిల్లా దర్శకుడు. శర్వా ఆర్ట్‌‌స బేనర్‌పై మైనేని వసుంధరదేవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 28 న విడుదల చేయటానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

    ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనీష్ యోహాన్ కురువిల్ల మాట్లాడుతూ ప్రతి మనిషికి ఏదో నమ్మకం ఉంటుందని, తమ సినిమాకు మాత్రం కథ, టీమ్ నమ్మకంగా ఉంటుందని, చిత్రాన్ని పూర్తి ఫ్యాషన్‌తో నిర్మించామని తెలిపారు. చిత్రం కథ గురించి శర్వానంద్ మాట్లాడుతూ...''డబ్బుకు లోకం దాసోహం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు.. మనిషి డబ్బు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. పది రూపాయలు కలిసొస్తుందంటే ఏదైనా చేస్తాడు. అలాంటిది ఏకంగా రూ.కోటి వస్తుందంటే వదులుతాడా? అందుకే నోట్ల కట్టల వెంట ఓ యువకుడు పరుగులు పెట్టాడు. మరి ఆ రూ.కోటి అందుకొన్నాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే'' అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''పూర్తి మాస్‌ యాక్షన్‌ చిత్రమిది. అన్ని కమర్షియల్‌ హంగులు జోడించిన కథాబలం ఉన్న సినిమా ఇది. పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. శ్రీహరి ఓ కీలకపాత్రలో సహజనటనతో కనిపిస్తారు. ఆయన నటన హైలైట్‌. సంగీతం అతిరథుల మధ్య ఈ 8న ఘనంగా రిలీజ్‌ చేస్తున్నాం. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తాం'' అన్నారు. అలాగే ''శర్వానంద్‌ ఇప్పటి వరకూ ప్రేమకథలకే పరిమితమయ్యాడు. అతనిలోని యాక్షన్‌ కోణాన్ని చూపించే చిత్రమిది. అన్ని వాణిజ్య హంగులూ ఉన్నాయి. శ్రీహరి పాత్ర ఎంతో కీలకం'' అన్నారు.

    English summary
    
 Sharwanand and Priya Anand -starrer Ko ante Koti is gearing for release on December 28. The film has celebrated its audio launch recently and has garnered good response for the music. The film has completed its entire shooting and is currently in post production works.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X