‘కొబ్బరిమట్ట’పై కుట్రలు... బిగ్‌బాస్1 టీమ్ సపోర్ట్, వంద రెట్ల ఎఫెక్ట్ ఉంటుందన్న సంపూ!

Recommended Video

Kobbari Aakulu Song From Sampoornesh Babu's Movie Kobbari Matta

సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కొబ్బరిమట్ట' సాంగ్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌తో గ్రాండ్‍‌గా జరిగింది. ఈ వేడుకకు సంపూతో పాటు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్న సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ..ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా మార్చి మా మధ్య ఇంత ఆత్మీయతను పంచినందుకు ఫస్ట్ బిగ్‌బాస్‌కు నా ధన్యవాదాలు తెలిపారు.

వంద రెట్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్న సంపూ

వంద రెట్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్న సంపూ


‘హృదయకాలేయం' కంటే వంద రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేసే విధంగా ‘కొబ్బరి మట్ట' సినిమా ఉంటుంది. నవంబర్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హృదయ కాలేయం చిత్రాన్ని ఆదరించినట్లు నన్ను, నా సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సంపూ తెలిపారు.

చాలా కుట్రలు చేశారు

చాలా కుట్రలు చేశారు


‘హృదయ కాలేయం' సమయంలో మాకు చాలా మంది సపోర్ట్ చేశారు. మేము ఎదగాలని మనస్ఫూర్తిగా చేశారు. ‘కొబ్బరి మట్ట' విషయంలో అంతా రివర్స్ జరిగింది. ఎన్ని అడ్డంకులు పెట్టాలో అన్నీ పెట్టారు. ఈ రెండు మూడేళ్లలో జీవితంలో చూడాల్సింది అంతా చూసేశాం. ఎన్ని కష్టాలు వచ్చినా మా హీరో సంపూ నాకు సపోర్టుగా ఉన్నారని... సాయి రాజేష్ అన్నారు.

 మీ నవ రంద్రాల నుండి నవ రసాలు తీస్తాడు

మీ నవ రంద్రాల నుండి నవ రసాలు తీస్తాడు


సంపూ ఈ చిత్రం ద్వారా మీ అందరి నవ రంద్రాల నుండి నవ రసాలను బయటకు తీసుకొస్తాడు. బ్యాచిలర్స్ మందు, చికెన్ పెట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేసే సనిమా ఇది చిత్ర యూనిట్ వెల్లడించింది.

 బిగ్ బాస్1 టీమ్ సపోర్ట్

బిగ్ బాస్1 టీమ్ సపోర్ట్

సంపూ అడిగిన వెంటనే బిగ్ బాస్ 1 టీమ్ మొత్తం ఒప్పుకోవడం ఆనందంగా ఉంది. బిగ్ బాస్ 1లో వీళ్లు నవ్వులు పూయిస్తే... ఇపుడు అక్కడ రక్తాలు కారుతున్నాయి. బిగ్ బాస్ 1 కంటెస్టెంట్స్‌తో ఈ ఆడియో లాంచ్ చేయించడం ఆనందంగా ఉందని... సాయి రాజేష్ అన్నారు.

 సంపూకు విసెష్

సంపూకు విసెష్

ఈ ఆడియో వేడుకకు హాజరైన శివ బాలాజీ, కత్తి కార్తీక, సమీర్, ధనరాజ్, ముమైత్ ఖాన్, మధుప్రియ తదితరులు ‘కొబ్బరి మట్ట' సినిమా మంచి విజయం అందుకోవాలని, సంపూ మరో హిట్ కొట్టాలని విష్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X