ఫ్లాఫ్ సినిమాని జపాన్ కి...పరువు పోదా

By Srikanya

హైదరాబాద్ : ఇండియాలో హిట్టైన సినిమాను ఇతర దేశాలకు పంపితే అక్కడ ఆడి మనకు గౌరవం తెస్తుంది. అయితే ఇక్కడ డిజాస్టర్ సినిమాలను అక్కడకి పంపుతే తేడా రిజల్ట్ వస్తుందా. రజనీకాంత్ కు జపాన్ లో మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఇన్నాళ్లూ హిట్ చిత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ సూపర్ ఫ్లాఫ్ ..విక్రమ్ సింహా ని సైతం అక్కడ విడుదల చేయటానికి నిర్ణయించారు. జపాన్ భాషలోకి డబ్బింగ్ పూర్తి చేసారు. ఈ వార్త విన్నవాళ్లు రజనీకాంత్ అనవసరంగా ఈ చిత్రాన్ని జపాన్ కి పంపుతున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ ఆయనకు ఉన్న పరువు తీయటానికి కాకపోతే ఎందుకు ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయటం అని విమర్శిస్తున్నారు.

Kochadaiiyaan to get a mega release in Japan

కథ విషయానికొస్తే... కలింగపురం, కోట పట్టణం అనే రెండు రాజ్యాల మధ్య తరతరాలుగా శతృత్వం ఉంటుంది. కోట పట్టణం రాజ్యానికి రాజు ఉగ్ర సింహా(నాజర్), కలింగపురానికి రాజు రాజ మహేంద్రుడు(జాకీ ష్రాఫ్). కలింగపురానికి వీరుడు ధీరుడు అయిన రాణా అలియాస్ రణధీర(రజనీకాంత్) సర్వ సైన్యాధిపతి. రాణా నాయకత్వంలో కలింగపురం సేనలు శతృ దేశాలను ఓడిస్తాయి. కోట పట్టణంతో యుద్ధం సమయం వచ్చే సరికి ఉన్నట్టుండి రానా కలింగపురం నుండి కోటపట్టణం వైపుషిప్ట్ అవుతాడు. కోట పట్టణంలో సైన్యాధికారిగా నియమితుడవుతాడు. రాణా ఇక్కడికి వచ్చిందే కోటపట్టణం రాను ఉగ్రసింహను చంపడాని. రాణా ఇలా చేయడానికి కారణం అతని తండ్రి విక్రమ సింహ ఫ్లాష్ బ్యాక్......పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాలో రజనీ సరసన దీపికా పదుకొణే నటించింది. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. సునీల్‌ లుల్ల నిర్మాత. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరచిన పాటల్ని రీసెంట్ గా విడుదలయ్యాయి. 'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X