వావ్...3 వేల థియేటర్లలో విడుదలవుతోంది
చెన్నై: తమిళ సూపర్ స్టర్ రజనీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' చిత్రం మే 9న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ సినిమా కావడం, భారత దేశంలో తెరకెక్కిన తొలి మోషన్ కాప్చర్ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ తరహా 3డి చిత్రం రావడంతో భారతీ సినీ రంగంలో ఇదే తొలిసారి.
దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రాన్ని....విడుదల విషయంలోనూ భారీ ఏర్పాట్లు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 3 వేల పైచిలుకు ధియేటర్లలో విడుదల చేస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్టాలలో ఈచిత్రాన్ని దాదాపు 1000కిపైగా థియేటర్లు కేటాయించారు.

తెలుగులో ఈచిత్రం 'విక్రమసింహ' పేరుతో విడుదల కానుంది. తమిళం, తెలుగుతో పాటు హిందీ, ఇతర భాషల్లో కూడా ఈచిత్రం విడుదలవుతోంది. మలేషియా, జపాన్, యూఎస్ఏ, యూకె, ఆస్ట్రేలియాతో పాటు అనేక దేశాల్లో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు.
రజనీ కూతురు ఐశ్వర్య ఆర్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెఎస్ రవి కుమార్ స్క్రిప్టు అందించారు. పాండ్య సామ్రాజ్య రాజు కొచ్చాడయాన్ రణధీరన్ స్టోరీ ఇన్స్‌స్పిరేషన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రజనీకాంత్-దీపిక పదుకోన్ జంటగా నటించిన ఈ చిత్రంలో జాకీష్రాఫ్, శరత్ కుమార్, శోభన, ఆది, నాజర్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











