twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కొచ్చాడయాన్’పై క్వాలిటీ లేదనే విమర్శ, ఫ్యాన్స్ ఫైర్!

    By Bojja Kumar
    |

    చెన్నై: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న 'కొచ్చాడయాన్'పై నిన్నమొన్నటి వరకు ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైల్ విడుదలైన తర్వాత ఆ అంచనాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి.

    పూర్తి యానిమేషన్‌ గ్రాఫిక్స్‌తో ఈ ట్రైలర్ విడుదలై రెండు రోజుల్లోనే 10 లక్షలకుపైగా హిట్స్ సాధించి రికార్డు సృష్టించింది. ట్రైలర్ చూసిన చాలా మంది గ్రాఫిక్స్ నాణ్యత ఈ జనరేషన్ ప్రేక్షకులు ఊహించుకున్న స్థాయిలో లేదని అంటున్నారు. అయితే అభిమానులు మాత్రం ఇలాంటి విమర్శలను స్వీకరించడం లేదు. ట్రైలర్ అదిరిపోయిందని, సినిమా కూడా అదరిపోతుందని అంటున్నారు.

    అయితే సినిమా మేకర్స్ మాత్రం....'కొచ్చాడయాన్' చిత్రాన్ని హాలీవుడ్ యానిమేషన్ సినిమాలతో పోల్చవద్దని అంటున్నారు. ఇదే విషయాన్ని అభిమానులు సైతం ఉటంకిస్తూ.....సినిమా గ్రాఫిక్స్ క్వాలిటీగా లేవనే వారిపై విరుచుకు పడుతున్నారు. సోషల్ నెట్వర్కింగ్, ఫ్యాన్ పేజీల్లో ఈ విషయమై ఫైట్ నడుస్తోంది. అందుకు సంబంధించిన కామెంట్స్ కొన్ని....

    గ్రాఫిక్స్‌పై విమర్శ

    గ్రాఫిక్స్‌పై విమర్శ

    దర్శకురాలు సౌందర్య చాలా సందర్భాల్లో ఇది కార్టూన్ ఫిలిం కాదని చెప్పారు. కానీ ఇది కార్టూన్ చిత్రంలానే ఉంది. దీనికంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ఫిల్మ్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. ఈ సినిమాకు వారు పడ్డ కష్టాన్ని మేము శంకించడం లేదు. ఎంతో మంది లెజెండ్స్ ఈ చిత్రం కోసం పని చేసారు. గ్రాండ్ స్క్రిప్టు, భారీ తారాగణం, గొప్ప రచయితలు, గ్రేట్ మ్యూజీషియన్ ఈ చిత్రానికి పని చేసారు. ఇదే చిత్రాన్ని ఓ హాలీవుడ్ డైరెక్టర్ చేతిలో పెడితే ఇంకా గొప్పగా తీసే వారు. ఇంత భారీగా తీసిన వారు సినిమా తీసే ముందు అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ లేదా, లైప్ ఆఫ్ పై, ట్రాన్స్ ఫార్మర్స్, 300 చిత్రాల దర్శకులను సంప్రదిస్తే బాగుండేది...అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    అరుణ్ రెడ్డి అభిప్రాయం

    అరుణ్ రెడ్డి అభిప్రాయం

    పూర్ క్వాలిటీ యానిమేషన్. అదే బడ్జెట్‌తో రియల్ సినిమా తీస్తే ఇంకా బాగుండేది. రజనీకాంత్ అభిమానిగా ఆయన్ను రియల్‌గా చూడటమే నాకు ఇష్టం.

    హరీష్ మురళి అభిప్రాయం

    హరీష్ మురళి అభిప్రాయం

    ఈ విధంగా తీసిన మొదటి ఇండియన్ సినిమా ఇది. హాలీవుడ్లో మొదట్లో ‘పోలార్ ఎక్స్ ప్రెస్' అనే చిత్రాన్ని ఇలానే తీసారు. దాంతో పోలిస్తే కొచ్చాడయాన్ చాలా బెటర్. కానీ గ్రాఫిక్స్ మరింత క్వాలిటీగా ఉంటే బాగుండనేది నా అభిప్రాయం.

    సంకుసలె అభిప్రాయం

    సంకుసలె అభిప్రాయం

    90ల్లో వచ్చిన గ్రాఫిక్స్ మాదిగా ఉన్నాయి. కలర్ కూడా డల్‌గా ఉంది. ఇప్పుడు వస్తున్న గేమ్స్ ట్రైలర్స్ దీనికంటే 10 రెట్లు బెటర్‌గా ఉంటున్నాయి.

    ప్రశాంత్ అశోకన్ అభిప్రాయం

    ప్రశాంత్ అశోకన్ అభిప్రాయం

    హాలీవుడ్ యానిమేషన్ సినిమాల బడ్జెట్ తో పోలిస్తే ఈ చిత్రం బడ్జెట్ 1/6 మాత్రమే. ఇలాగే ఉంటుందని ముందు ఊహించాం. సినిమా అనిపించే విధంగా గ్రాఫిక్స్ క్వాలిటీ లేదు. వీడియో గేమ్ మాదిరి ఉంది.

    గౌతం నటరాజన్ అభిప్రాయం

    గౌతం నటరాజన్ అభిప్రాయం

    ట్రైలర్లో ఈచిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ 5 ఏళ్ల క్రితం వచ్చిన వీడియో గేమ్ మాదిరి ఉంది. డిస్నీ, పిక్సర్ సంస్థల హెల్ప్ తీసుకుంటే బాగుండేది.

    బెర్లిన్ మనో అభిప్రాయం

    బెర్లిన్ మనో అభిప్రాయం

    ఇండియాలో ఇలాంటి సినిమా తీసే ప్రయత్నం చేయడం గొప్పే. ఇది ఇండియన్ సినిమా. ఇది ప్లేన్ యానిమేషన్ కాదు. ఇతర సినిమాలతో పోలిస్తే ఇది చాలా గొప్పగా ఉంది. ఒక్కో సీన్ వెనక ఎంతో శ్రమ దాగి ఉంది.

    నవీన్ కుమార్ అభిప్పాయం

    నవీన్ కుమార్ అభిప్పాయం

    ఫ్రెండ్స్. దయచేసి వారిని నిరుత్సాహ పరచకండి. మీరు హాలీవుడ్ సినిమాలైన అవతార్, టిన్ టిన్ లాంటి వాటిని ప్రోత్సహిస్తారు. కానీ ఇండియన్ సినిమాకు ఎందుకు మద్దతు ఇవ్వరు. అవతార్ బడ్జెట్ 1500 కోట్లు. టిన్ టిన్ బడ్జెట్ 800 కోట్లు. కానీ కొచ్చాడయాన్ బడ్జెట్ 125 కోట్లు మాత్రమే. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి సినిమా తీయడం గ్రేట్.

    English summary
    Rajinikanth's Kochadaiiyaan is ruling social media and iTunes. The trailer of the film, which was launched on Sunday (March 9), has gone viral on internet as it has got more than 10 lakhs hits in just two days! But the other side of the story is that the quality of the film, despite the movie bosses requesting fans not to compare with Hollywood films, has come under scrutiny. Indeed, it has paved way for war of words between two groups.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X