‘కొడకా కోటేశ్వర్ రావు’ టీజర్ వచ్చేసింది: సిగ్గుమొగ్గేసిన పవన్ కళ్యాణ్
Recommended Video

'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన 'కొడకా కోటేశ్వర్ రావు' పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటలకు ఈ పాటను రిలీజ్ చేసేందుకు ముహూర్తం పెట్టారు. తాజాగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ ఈ సాంగ్ టీజర్ విడుదల చేశారు. దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ దగ్గరుండి ఈ పాటను రికార్డ్ చేయించారు.

సిగ్గుమొగ్గలైన పవన్ కళ్యాణ్
తొలుత ఈ పాట పాడటం మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ తొలుత సిగ్గుమొగ్గేశారు. మళ్లీ కాస్త తేరుకుని.... కొడకా కోటేశ్వర్ రావు అంటూ అదరగొట్టారు. ఈ టీజర్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచింది.

న్యూఇయర్ దద్దరిల్లాల్సిందే
డిసెంబర్ 31న సాయంత్రం ఈ సాంగ్ విడుదల చేస్తున్నారు. ఆ సాయంత్రం అందరూ న్యూఇయర్‌కు వేడుక సంబరాల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కొడకా కోటేశ్వరరావు సాంగ్ మార్మోగి పోవడం ఖాయం అంటున్నారు.

రికార్డులపై కన్నేసిన కొడకా కోటేశ్వరరావు
కొడకా కోటేశ్వరరావు సాంగ్.... 2018లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే ఈ పాటపై భారీగా అంచనాలున్నాయి, ఈ పాట డిసెంబర్ 31న విడుదలవుతుండటం మరింత ప్లస్సవుతుందని అంటున్నారు.
అజ్ఞాతవాసి
అజ్ఞాతవాసి సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ గత సినిమాలో పాడిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











