Ram Gopal Varma వ్యాఖ్యలపై కొడాలి నాని కౌంటర్.. కాలమే సమాధానం అంటూ ఏపీ మంత్రి కామెంట్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు వ్యవహారం ఇంకా హాట్ హాట్ గా నడుస్తూనే ఉంది. ఈ వ్యవహారం మీద రంగంలోకి దిగిన వర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని తనకు ఎవరో తెలియదు అంటూ వర్మ చేసిన వ్యాఖ్యల మీద మంత్రి కొడాలి నాని స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

కొడాలి నాని కౌంటర్

కొడాలి నాని కౌంటర్


వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో జగన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా కొంతమంది మంత్రులను పేర్లు ప్రస్తావిస్తూ ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మకు వైసీపీలో ఫైర్ బ్రాండ్ మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.

ఏమైనా మాట్లాడతాడు

ఏమైనా మాట్లాడతాడు

రాంగోపాల్ వర్మ కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్ర గురించి రామ్ గోపాల్ వర్మ ఏమైనా మాట్లాడతాడు అని ఆయన ఎద్దేవా చేశారు. అసలు పక్క రాష్ట్రంలో ఇతర దేశాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే వాళ్ళ గురించి మేము పట్టించుకునే అవసరం లేదని కొడాలి నాని పేర్కొన్నారు. అలాగే సినిమా టికెట్ల విషయంలో మా వైఖరి ఇదే అని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టారు.

నాని ఎవరో తెలియదు

నాని ఎవరో తెలియదు


ఈ విషయం మీద తనదైన శైలిలో స్పందించిన రామ్ గోపాల్ వర్మ అసలు తనకు కొడాలి నాని ఎవరో తెలియదు అంటూ కామెంట్ చేశాడు. దీంతో పెను దుమారం రేగినట్టు అయింది.
చాలా మంది టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని అడుగుతున్నారు కానీ నాకు తెలిసిన న్యాచురల్ స్టార్ నాని ఒక్కడే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని ఆయన చెప్పుకొచ్చారు.

తప్పుడు ప్రచారం చేస్తున్నారు

తప్పుడు ప్రచారం చేస్తున్నారు


ఈ విషయం మీద ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించిన కొడాలి నాని సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు సహా ఎల్లో మీడియా ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తోందని కొడాలి నాని ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మకు కొడాలి నాని తెలియక పోవడంలో అసలు ఏమాత్రం ఆశ్చర్యం లేదు అని పేర్కొన్న కొడాలి నాని.

సమయం పడుతుంది

సమయం పడుతుంది

ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది, ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వున్నారు అని ఇప్పుడే చాలా మందికి తెలుస్తుందంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. ఆయనే తెలియడానికి ఇన్ని రోజులు పడితే నేను ఎవరో తెలియడానికి మరి కొంత సమయం పడుతుందని రామ్ గోపాల్ వర్మ ను ఉద్దేశించి కొడాలి నాని కామెంట్స్ చేశారు. మరి ఈ వ్యాఖ్యల మీద రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X