twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ మేటర్ పై నాని...

    By Staff
    |

    జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాకు వంశీకి సమయం కేటాయించకుండా నేను అడ్డుపడ్డానని రాశారు. అందులో ఏ మాత్రం నిజం లేదంటూ గుడివాడ ఎమ్మల్యే కొడాలి నాని చెప్పారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వల్లభనేని వంశీకి, తనకూ విభేధాలు ఏర్పడినట్లుగా కొన్ని పత్రికల్లో వచ్చన వార్తల్లోనూ నిజంలేదని ఆయన స్పష్టం చేసారు. అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ఇక కొద్ది రోజుల క్రితం వల్లభనేని వంశి,ఎమ్మల్యే నానికి ఓ చిత్రం డేట్స్ విషయంలో పొరపొచ్చాలు వచ్చాయంటూ సాక్షి దినపత్రికలో వార్తలు వచ్చాయి. అలాగే ఎన్టీఆర్..మేనేజర్ సుకుమార్ ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేసారంటూ అతనిపై వేటు సైతం వేసారని వినవచ్చింది.

    ఎన్టీఆర్ హీరోగా షాక్ డైరక్టర్ హరీష్ శంకర్ తో నల్లమలుపు బుజ్జి నిర్మించతలపెట్టిన ఎమ్మల్యే చిత్రం నిర్మాణం విషయంలో ఈ విభేధాలు పొడచూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వి.వి.వినాయిక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తయారవుతున్న అదుర్స్ చిత్రానికి నల్లమలపు బుజ్జి నిర్మాణ భాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. దానిని కొడాలి నాని,వంశీ మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బుజ్జీ నిర్మించే చిత్రంలో నటించాలని ఎన్టీఆర్ ని వంశీ మోహన్ అడిగారు. అయితే ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వలేదు.

    ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించే చిత్రంలో నటించేందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఆ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరక్ట్ చేస్తున్నారు. దాంతో బుజ్జీ నిర్మించే చిత్రంలో ఎన్టీఆర్ నటించాలంటే మరో ఏడాది పడుతుంది. ఈ సంఘటనతో దీని వెనక ఎవరి ప్రోద్బలమో ఉందని భావించిన వంశీమోహన్ తీవ్రంగా నొచ్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందువల్లే ఎన్టీఆర్ హీరోగా నిర్మిస్తున్న చిత్రంలో తన భాగస్వామిగా ఉన్న ఎమ్మల్యే నానిని తప్పించినట్లు పత్రికల్లో వచ్చింది.ఇప్పుడు దానని కొడాలి నాని ఖండిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X