పాపం కొడాలి నాని.. పవన్ కల్యాణ్ క్రేజ్ దెబ్బకు విలవిల!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలు ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ వ్యూహాలను రచిస్తున్నాయి. దాంతో ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. అయితే ఒకపార్టీ నేతలు మరో పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ దుమ్మెత్తి పోసుకొంటున్నారు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌ను కొడాలి నాని ఓ రేంజ్‌లో ఆరోపణలు, విమర్శలు చేస్తూ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే వారిద్దరూ ఒకే వేదికపైన కనిపించడం ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ ఉన్న స్టేజ్‌పై కొడాలి నాని ఎదురైన అనుభవం గురించి నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. కొడాలి నానికి ఎదురైన అనుభవం ఏమిటనే విషయంలోకి వెళితే..

ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాపు నేత, స్వర్గీయ వంగవీటి మోహన రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, పుష్పవల్లి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహం కృష్ణా జిల్లాలోని పోరంకిలోని ఎం రిసార్టులో అంగరంగవైభవంగా జరిగింది. ఈ వివాహానికి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, తోట చంద్రశేఖర్, ఎంపీ కేశి నేని నాని ఇతర వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు హాజరయ్యారు.

 Kodali Nani faces the music to pawan Kalyan image at Vangaveeti Radha Marriage: Video goes Viral

విజయవాడ రాజకీయాల్లో కీలకంగా మారిన వంగవీటి రాధా, పుష్పవల్లీ వివాహానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు, నేతలు తరలివచ్చారు. దాంతో భారీగా తొక్కిసలాట, తోపులాట చోటు చేసుకొన్నది. వేదికపైకి అందరూ ఒకేసారి రావడంతో కొంత గందరగోళం నెలకొన్నది. జనాన్ని కంట్రోల్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్, గన్‌మెన్లకు కష్టంగా మారింది.

రాధాకృష్ణ వివాహం తర్వాత వధూవరులను ఆశీర్వదించేందుకు పవన్ కల్యాణ్ స్టేజ్‌పైకి వెళ్లారు. ఆయనతోపాటు నాదెండ్ల మనోహర్ కూడా వచ్చారు. అయితే అదే సమయంలో పవర్ స్టార్ వెనుక ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీకి చుక్కలు కనిపించాయి. పవన్ కల్యాణ్ రావడంతో అభిమానులు, పెళ్లికి వచ్చిన జనం ఒక్కసారిగా స్టేజ్‌పైకి వచ్చారు. దాంతో పవన్ అభిమానులు కొడాలి నాని, వంశీని వెనక్కి తోశారు. దాంతో వారిద్దరూ కిందపడినంత పనైంది. గన్‌మెన్లు ఆసరాగా నిలవడంతో తొక్కిసలాట జరగకుండా పెద్ద ప్రమాదమే తప్పింది అని అంటున్నారు.

 Kodali Nani faces the music to pawan Kalyan image at Vangaveeti Radha Marriage: Video goes Viral

ప్రస్తుతం రాధాకృష్ణను పవర్ కల్యాణ్ ఆశీర్వదించే సమయంలో కొడాలి నాని పడిన ఇబ్బందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొడాలి పరిస్థితి చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నెటిజన్ల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ క్రేజ్‌ను తట్టుకోవడం కష్టం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 Kodali Nani faces the music to pawan Kalyan image at Vangaveeti Radha Marriage: Video goes Viral

కొడాలి నానిపై పవన్ కల్యాణ్ అభిమానులు ట్రోల్ చేస్తూ.. మైక్ ఇస్తే పవన్ కల్యాణ్ మీద బూతులతో విరుచుకు పడటం కాదు.. ఎదురుగా వస్తే.. కనీసం నిలబడటంత కూడా మీ వల్ల కాదు అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. మరొకరు పవన్ కల్యాణ్ రేంజ్ ఎవరికి అందదు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X