1000 మంది బాలకృష్ణలు వచ్చినా.. Jr.NTRను ఏమీ చెయ్యలేరు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

నందమూరి ఎన్టీ రామారావు వర్ధంతి రోజున.. ఆ కుటుంబంలోని విభేదాలు బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తండ్రికి నివాళులు అర్పించేందుకు వచ్చిన బాలకృష్ణ.. ఆ ఫ్లెక్సీలను చూసి..తొలగించమని ఆదేశించారు. దీనితో ఇక్కడే అసలు గొడవకు దారితీసింది. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. బాలయ్యపై మండిపడుతున్నారు. మరోవైపు ఏపీ మాజీ మంత్రి కోడాలి నాని ఈ విషయంపై స్పందించారు. వెయ్యి మంది బాలకృష్ణలు వచ్చినా.. ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

నేడు పెద్ద ఎన్టీ రామారావు చనిపోయిన రోజు. ఈరోజున ఎన్టీఆర్ 27వ వర్ధంతి. దీంతో ఉదయమే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఉదయమే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వచ్చి.. తమ తాతా నందమూరి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పాంజలి పెట్టారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘాట్ వద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Recommended Video

Jr NTR కి జరిగిన అవమానంపై Kodali Nani.. బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు | Telugu Filmibeat

Kodali Nani Sensational Comments on Balakrishna About Junior NTR Felix Remove Issue News Goes Viral

ఘాట్ ప్రాంగణంలో ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టడంతో... అప్పుడే వచ్చిన నందమూరి బాలకృష్ణ వాటిని చూసి.. తొలగించమని ఆదేశించాడు. అనంతరం తన తండ్రికి నివాళులు అర్పించాడు. ఇక బాలయ్య ఆదేశంతో.. బాలయ్య ఫ్యాన్స్ వాటిని తొలగించారు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడ్డారు. బాలయ్య ఇలా చేయడం సరికాదంటూ మండిపడ్డారు. ఇక ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎన్టీఆర్ ఘాట్ రోడ్డు మీద పడివేయడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. ఈ విషయంపై తాజాగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. లోకేష్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపు ఘటనపై స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి అంటూ ఫైర్ అయ్యారు

వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ ను ఏం చేయలేరు అంటూ కొడాలి నాని కామెంట్స్ చేశారు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరన్న కొడాలి నాని.... ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్‌ వర్ధంతి చేస్తారా అంటూ మండిపడ్డారు. పెద్ద ఎన్టీఆర్ పేరు చెప్పి భజన చేసుకునే వీరు.. ఎన్టీఆర్ కు నివాళులు అర్పించే అర్హత లేదని వ్యాఖ్యానించారు.

కొడాలి నాని బాలయ్య, చంద్రబాబులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మరోవైపు ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు విషయం నెట్టింట హాట్ టాపిక్ గామారింది. బాలయ్య ఫ్యాన్స్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్ చంద్రబాబుకు సపోర్ట్ ఇవ్వకపోతే ఇంతలా చేయాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆయన సినిమాలు చేస్తూ... బిజీగా ఉంటే.. ఇలా చేయడం తప్పు అంటూ బాలయ్య మీద గరం గరంగా ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X