Just In
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంటర్వ్యూ: కొడాలి నాని
Monday, September 13 2004
గుడుంబా శంకర్ అంచనాలకుతగ్గట్టు లేకపోయినా హీరోయిన్ మీరా జాస్మిన్ మాత్రంముద్దుగా బొద్దుగా ప్రేక్షకులను అలరించింది. ఆమె ఇంటర్వ్యూ.జాతీయ అవార్డు పొందిన తర్వాత ఆమెనటించిన గుడుంబా శంకర్ ప్రేక్షకులనే కాదు ఆమెనూనిరుత్సాహపరిచి ఉంటుంది. జాతీయ అవార్డు తెచ్చిన పదోమ్ ఒన్ను ఒరువిలాపం గురించే ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎక్కువగా మాట్లాడింది.
ప్రశ్న: మీరు తిరువళ్ళకు చెందినక్రిస్టియన్ అమ్మాయి కదా? అవార్డు పొందిన ఆ లో ముస్లింయువతిగా అంత సహజంగా ఎలా నటించగలిగారు?
మీరా: చిన్నప్పుడు నేను ఒకమారుమూల గ్రామంలో పెరిగాను. నాకు జ్వరం వచ్చినప్పుడల్లామానాన్న నన్ను భుజాన వేసుకుని పొరుగూరికి తీసుకెళ్ళేవాడు.అప్పుడు ఆ గ్రామంలోని ముస్లింల జీవన విధానాన్ని, వారి హావభావాలనుపరిశీలించేదాన్ని. విలాపం షూటింగ్ జరిగిన గ్రామాన్ని చూడగానే నాచిన్ననాటి గ్రామం, వాతావరణ గుర్తుకు వచ్చాయి.
ప్రశ్న: ఆ పాత్ర కోసం మీరు ప్రత్యేకసాధన ఏమైనా చేశారా?
అవార్డు పొందాలన్న లక్ష్యంతోనే ఆ చిత్రంలోకష్టపడి పనిచేశారా?
తెలుగు వంటి ఇతర భాషల్లో నేనునటిస్తాను. మలయాళంలో మాత్రం నటించాల్సిన అవసరం లేదు.పాత్రలో జీవిస్తే చాలు. ప్రోత్సాహం ఉంటే గానీ నేను గొప్పగానటించలేను. ఆ డైరెక్టర్ చంద్రన్ ఆర్టిస్టుల ప్రతిభనువెలికి తీయడానికి ఎంతగానో ప్రోత్సహిస్తారు.గుడుంబా శంకర్‌లో మీరు సొంతంగాడబ్బింగ్ చెప్పుకోడానికి కారణం?
తెలుగు వచ్చిన హీరోయిన్లు కూడాసొంతంగా డబ్బింగ్ చెప్పడం లేదు కదా?ఆ సాహసం మీరెందుకుచేశారు?
నిజానికి ఆ కు నామాటలు నేనుపలకాలన్న కోరిక కలిగింది. అదే విషయం నిర్మాత నాగబాబుకు, హీరోపవన్‌కు చెప్పాను. వెరైటీగా ఉంటుందని వెంటనే వాళ్ళుఅంగీకరించారు.షూటింగ్ ్రస్టెస్‌ను మీరెలాఅధిగమించగలుగుతున్నారు?
అది కష్టమే. సెలవులకు ఒక సారిఇంటికెళ్ళి తిరిగి వచ్చినప్పుడు షూటింగ్‌కు వెళ్ళబుద్ధి కాదు. వాంతులు,కడుపు నోప్పి వచ్చినట్టుగా ఉంటుంది.మీకు ఎటువంటి పాత్రలు ఇష్టం?
నేను చేయగలిగిన పాత్రలు. నిజజీవితానికి దూరంగా ఉండే డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడతాను.మీ స్వభావమేమిటి?
చాలా ఎమోషనల్. ఒక్కోసారి మౌనంగాఅలా కూర్చును ఉండిపోవాలనుకుంటాను. ఎవరైనా ఆ నిశ్సబ్దానికి భగంకలిగిస్తే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ప్రయాణంలో విషాద గీతాలువిన్నప్పుడు కన్నీళ్ళు ఆపుకోలేను. అప్పుడు నన్ను చూసిన వాళ్ళునేను పిచ్చిదాన్నని అనుకుంటారు.ఒక నటిగా మీ బలం ఏమిటి?
Archives