twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోడి రామకృష్ణ మృతి: సినిమా తీస్తే 365 రోజులు పండుగే.. అగ్రహీరోలకు బ్లాక్‌బస్టర్లు!

    |

    ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ దాసరి నారాయణరావు శిష్యుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కోడి రామకృష్ణ వందకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. గత కొద్దికాలంగా ఆరోగ్యం సహకరించకపోవడంతో సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం అరుంధతి. బ్లాక్ బస్టర్ సినిమా ఇంట్లో రామయ్య.. విధీలో కృష్ణయ్యతో కెరీర్ ఆరంభించి.. మరో బ్లాక్ బస్టర్ అరుంధతితో తన సినీ ప్రయాణాన్ని ముగించిన ఘనత కోడి రామకృష్ణది. ఆయన ఆనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం (ఫిబ్రవరి 22)న తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా పరిశ్రమలో కోడి రామకృష్ణ సాధించిన ఘనతలు ఇవే...

    చిరంజీవికి తొలి బ్లాక్‌బస్టర్

    చిరంజీవికి తొలి బ్లాక్‌బస్టర్

    దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వశాఖలో కెరీర్ ప్రారంభించిన కోడి రామకృష్ణ 1982లో తన తొలి చిత్రంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తెరకెక్కించారు. చిరంజీవి నటించిన ఈ చిత్రం తెలుగు నాట విజయదుంధుబి మోగించింది. ఏకధాటిగా 365 రోజులపాటు ఈ చిత్రం ఆడటమే కాకుండా వసూళ్ల పరంగా భారీ రికార్డులను అందుకొన్నది.

    తరంగిణి‌తో రికార్డుల మోత

    తరంగిణి‌తో రికార్డుల మోత

    తొలి చిత్రం అందించిన విజయం ఊపుతో 1982లోనే తన రెండో చిత్రంగా సుమన్, భానుచందర్ కాంబినేషన్‌లో తరంగిణి చిత్రాన్ని తెరకెక్కించగా ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం కూడా దాదాపు ఏడాది పొడుగునా ఆడటం జరిగింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ లభించడంతో ఈ చిత్రం కూడా కనకవర్షం కురిసింది.

    నందమూరి బాలకృష్ణకు భారీ సక్సెస్

    నందమూరి బాలకృష్ణకు భారీ సక్సెస్

    వరుస విజయాలతో దూసుకెళ్తూ నందమూరి బాలకృష్ణతో తీసిన మంగమ్మ గారి మనవడు అప్పట్లో సంచలన విజయం సాధించింది. సుహాసిని, భానుమతి రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 365 రోజులపాటు ఆడింది. బాలకృష్ణ కెరీర్‌, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులను నెలకొల్పింది.

    అత్యున్నత టెక్నాలజీతో

    అత్యున్నత టెక్నాలజీతో

    ఇక సినిమా పరిశ్రమలో కాలానుగుణంగా చోటుచేసుకొంటున్న సాంకేతిక మార్పులనుసైతం కోడి రామకృష్ణ ఒడిసి పట్టుకొన్నారు. అమ్మోరు, దేవీ, అరుంధతి, అంజి లాంటి చిత్రాలు టెక్నికల్, గ్రాఫిక్స్‌ అంశాలను దట్టించి సగటు ప్రేక్షకుడిని వెండితెరపై అబ్బురపరిచాడు. అటు పాతతరం, కొత్తతరం సినిమాలకు కోడిరామకృష్ణ వారధిగా నిలిచారు.

    అమ్మోరు, దేవీ, అరుంధతి చిత్రాలతో

    అమ్మోరు, దేవీ, అరుంధతి చిత్రాలతో

    అత్యున్నత సాంకేతికతతో రూపొందించిన అమ్మోరు, దేవీ, అరుంధతి, అంజి చిత్రాలకు అనూహ్యమైన ప్రేక్షకాదరణ లభించింది. అమ్మోరు, దేవీ, అరుంధతి టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేశాయి. పాతతరం దర్శకుడైన కోడి రామకృష్ణ కొత్త దర్శకుల కంటే ధీటుగా టెక్నాలజీతో కూడిన చిత్రాలను రూపొందించడం విశేషం.

    English summary
    Kodi Ramakrishna is an Indian film director and writer known for his works predominantly in Telugu cinema, and a few Tamil, Malayalam and Hindi films. One of the prolific film director in Telugu, Kodi Ramakrishna has directed a wide range of films, in a variety of genres such as drama films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X