twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చనిపోయిన హీరోను కూడా.... ఆ అద్భుతం చేసిన తొలి దర్శకుడు కోడి రామకృష్ణ!

    |

    సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత సినిమా చూసే ఎక్స్ పీరియన్సే మారిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి తెరపై అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ సినీ పరిశ్రమలోకి అంతగా ప్రాచుర్యంలోకి రాని రోజుల్లోనే కోడి రామకృష్ణ ఆ సాంకేతికను తన సినిమాల్లో ఉపయోగించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.

    ఆయన దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు, దేవి, దేవి పుత్రుడు, అంజి, అరుంధతి చిత్రాలో విఎఫ్ఎక్స్ ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతి కలిగించాయి. ఆయన ఇంతటితో ఆగలేదు.. చనిపోయిన నటుడిని గ్రాఫిక్స్ ద్వారా చూపించడం ద్వారా తెరపై ఒక అద్భుతాన్ని సృష్టించారు.

    విష్ణువర్ధన్‌ను గ్రాఫిక్స్‌ ద్వారా

    విష్ణువర్ధన్‌ను గ్రాఫిక్స్‌ ద్వారా

    ‘నాగభరణం' అనే కన్నడ చిత్రంలో స్వర్గస్తులైన ప్రముఖ సాండల్‌వుడ్ స్టార్ విష్ణువర్ధన్‌ను గ్రాఫిక్స్‌ ద్వారా వెండితెరపై చూపించారు. కోడి రామకృష్ణ చేసిన ఈ ప్రయోగం అప్పట్లో కన్నడ సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

    అధునాతన పద్దతులతో...

    అధునాతన పద్దతులతో...

    ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు కాకుండా విభిన్నమైన జోనర్లు, విభిన్నమైన కాన్సెప్టులతో కోడి రామకృష్ణ దర్శకుడిగా తన ప్రయాణం కొనసాగించారు కాబట్టే వందకు పైగా చిత్రాలు చేయగలిగారు. ప్రేక్షకులను సంతృప్తి పరచాలంటే అధునాతన పద్ధతుల్లో సినిమా తీయాలని ఆయన చెబుతుండేవారు.

    సాంకేతికతకు మన నేటివిటీ జోడించి

    సాంకేతికతకు మన నేటివిటీ జోడించి

    నా దృష్టిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ అనేది ఇంగ్లిష్ భావోద్వేగం. దానికి మన నేటివిటీ, మనదైన కథ జోడించినపుడే సినిమా ప్రేక్షకులకు రీచ్ అవుతుంది, నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి పెడుతుందని కోడి రామకృష్ణ చెబుతుండేవారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన దేవి, అరుంధతి లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించాయి.

    కోడి రామకృష్ణ

    కోడి రామకృష్ణ

    వందకుపైగా చిత్రాలను డైరెక్ట్ చేసి శతాధిక చిత్రాల దర్శకుడిగా, టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కోడి రామకృష్ణ అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్‌లో కన్నమూశారు. రామకృష్ణ మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    English summary
    Kodi Ramakrishna created kannada star Vishnuvardhan VFX role in Nagabharanam. Kodi Rama Krishna who is known for making visual effects based films and he had Ammoru and Arundhathi to his credit along with Anji. Nagabharanam is produced by Sohail Ansari and Dhaval Jayantilal Gada while mmusic is by Guru Kiran. starring: Dr. Vishnuvardhan (Created in VFX), Ramya & Diganth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X