కోడి రామకృష్ణ మృతి: ఆవేదనకు లోనైన పవన్ కల్యాణ్

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మరణంతో సినీ పరిశ్రమ దుఖ: సాగరంలో మునిగిపోయింది. శతాధిక దర్శకుడు ఇకలేరనే వార్తతో పలువురు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. కోడి రామకృష్ణ మృతికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్, ఎంపీ సుబ్బిరామిరెడ్డి, బోయపాటి శ్రీను, గోపిచంద్ తదితరులు సంతాపాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. వారేమన్నారంటే.

ఆవేదనకు గురయ్యాను

ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ మృతివార్తతో ఆవేదనకు లోనయ్యాను. 100కుపైగా చిత్రాలను రూపొందించిన ఆయన అస్వస్థతకు గురైతే కోలుకొంటారని అనుకొన్నాను. ఆయన మరణంతో తీవ్ర విషాదం కలిగింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కోడి రామకృష్ణ తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో అన్నయ్య చిరంజీవి కథానాయకుడు. అప్పటి నుంచి విభిన్నమైన చిత్రాలు అందించారు. ట్రెండ్‌కు అనుగుణంగా విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా రూపొందించడంలోను తన శైలిని చూపించారు. వారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిస్తున్నాను.

 తీవ్ర వేదనకు గురయ్యాను

తీవ్ర వేదనకు గురయ్యాను

కోడిరామకృష్ణ గారి హఠాన్మరణ వార్త విని తీవ్ర వేదనకు లోనయ్యాను. నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి మ‌ర‌ణం బాధాక‌రం. తెలుగు సినిమా ఓ మంచి దర్శకుడి ని కోల్పోయింది. తెర‌పై ఆయ‌న ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాంటి ద‌ర్శ‌కుడు క‌న్నుమూయ‌డం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడు, పరిశ్రమలో అందరికీ ఎంతో ఆప్తుడు, నాకు మంచి మిత్రులు కోడి రామకృష్ణ గారు లేకపోవడం పరిశ్రమకి ఎప్పటికీ తీరని లోటు. వ్యక్తిగతంగా మంచి మిత్రున్ని కోల్పోయాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలుపుతున్నాను అని నిర్మాత, రాజ్యసభ సభ్యులు
డా. టి. సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

కోడి రామ‌కృష్ణ‌గారు ఓ సినీ లైబ్ర‌రీ - బోయ‌పాటి శ్రీను

కోడి రామ‌కృష్ణ‌గారు ఓ సినీ లైబ్ర‌రీ - బోయ‌పాటి శ్రీను

కోడి రామ‌కృష్ణ‌గారు సినీ లైబ్ర‌రీ. ఓ గ్రేట్ డైరెక్ట‌ర్ ఇక లేరు అనే విష‌యం తెలియ‌గానే ఎంతో బాధ‌ప‌డ్డాను. ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని బోయపాటి శ్రీను ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.

కోడిరామ‌కృష్ణ‌గారిని కోల్పోవ‌డం తీరని లోటు

కోడిరామ‌కృష్ణ‌గారిని కోల్పోవ‌డం తీరని లోటు

తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ‌లోకి వ‌స్తున్న కొత్త ద‌ర్శ‌కుల‌కు కోడి రామ‌కృష్ణగారి సినిమాలు ఓ డిక్ష‌న‌రీలాంటివి. అలాంటి ఓ దిగ్ధ‌ర్శ‌కుడిని కోల్పోవడం తెలుగు సినిమాకు తీర‌ని న‌ష్టం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి అని గోపిచంద్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X