Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మధ్యలోనే ఆగిపోయిన బాలయ్య చిత్రం.. మలేషియన్ విమానం కథ చెప్పిన కోడి రామకృష్ణ!
కోడి రామకృష్ణ టాలీవుడ్ దిగ్గజ దర్శకులలో ఒకరు. 100కు పైగా చిత్రాలకు ఆయన దర్శత్వం వహించారు. శుక్రవారం రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో భాదపడుతున్న కోడి రామకృష్ణ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. కోడి రామకృష్ణ మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కోడి రామకృష్ణకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని, మధుర జ్ఞాపకాలని సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు.
అగ్ర హీరోలతో
కోడి రామకృష్ణ టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలయ్యతో అనేక చిత్రాలు రూపొందించారు. బాలయ్యతో మంగమ్మగారి మనవడు, మూవ గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. అప్పట్లో ఈచిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుని మధ్యలోనే ఆగిపోయింది. ఆ చిత్రం గురించి కోడి రామకృష్ణ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
విక్రమ సింహ భూపతి
విక్రమ సింహ భూపతి షూటింగ్ ప్రారంభమై 60 షూటింగ్ పూర్తయింది. అనుకోని కారణాలవలన ఆ చిత్రాన్ని ఆపేశారు. ఆ చిత్రం ఎందుకు ఆగిపోయింది అని ప్రశ్నించాయి కోడి రామకృష్ణ సరదాగా స్పందించారు. దీని గురించి సింబాలిక్ గా చెబుతా. ఆ మధ్యన ఓ మలేషియన్ విమానం సముద్రంలో పడిపోయి కనిపించకుండా పోయింది. ఆ విమానం ఎందుకు పడిపోయింది అంటే ఎవరు సమాధానం చెప్పగలరు అని అన్నారు. ఆ విమానం ఎక్కడ పడిపోయిందో ఎవరికీ తెలియదు. ఈ విక్రమ సింహ భూపతి కూడా అంతే అని అన్నారు.
ఎప్పటికైనా పూర్తి చేయాలి
ఆ చిత్రాన్ని ఇప్పుడు పూర్తి చేసి విడుదల చేసినా సూపర్ హిట్ అవుతుంది అని కోడి రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. లయన్ కింగ్ అనే చిత్రం ఆధారంగా దానిని రూపొందించాం. ఎప్పటికైనా ఆ చిత్రాన్ని పూర్తి చేస్తా అని కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారు.
కుటుంబకథా చిత్రాలు
బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన చాలా చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ గా అలరించాయి. ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు లాంటి చిత్రాలన్నీ సూపర్ హిట్సే. ఇక చిరంజీవితో కూడా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ, ఆలయ శిఖరం లాంటి కుటుంబ కథా చిత్రాల్ని రూపొందించారు. కుటుంబ చిత్రాలు, భారీ గ్రాఫిక్స్ తో ఫాంటసీ చిత్రాలు రూపొందించడంలో కోడి రామకృష్ణది ప్రత్యేక శైలి.