దర్శకుడు కోడి రామకృష్ణకు అస్వస్థత

అయితే రెండ్రోజులు ఉపవాసం ఉండడం వల్ల ఆయనకు రక్తపోటు తగ్గిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోడి రామకృష్ణ కుమార్తె దివ్యదీప్తి తెలిపారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఆయన ఓ తమిళ చిత్రం షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఉన్నారు.
ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో పుట్టపర్తి సాయిబాబా మహిమలతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సౌభాగ్య చిత్ర పతాకంపై ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ మలయాళ హీరో దిలీప్‌ని ఎంచుకొన్నట్టు నిర్మాత కరాటం రాంబాబు వెల్లడించారు.
ప్రశాంతి నిలయం సెట్‌ను కోటి రూపాయల వ్యయంతో అత్యంత భారీ స్థాయిలో హైదరాబాద్‌లో వేస్తున్నాం. ఆర్ట్ డైరక్టర్ నాగు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అనువణువూ పరిశీలించి సెట్‌ను తీర్చిదిద్దుతున్నారని నిర్మాత తెలిపారు.


Click it and Unblock the Notifications











