twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రక్తం వచ్చినా బాలయ్య అదే పట్టు, రాజశేఖర్‌ను కంట్రోల్ చేయలేం....

    By Bojja Kumar
    |

    Recommended Video

    Kodi Ramakrishna Comments On Tollywood Heroes

    తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో గొప్ప చిత్రాలు అందించిన దర్శకుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు కోడి రామకృష్ణ. తెలుగులో నిన్నటితరం అగ్రహీరోలందరితో ఆయన పని చేశారు. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు తాను పని చేసిన హీరోలతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తదితరులతో తన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ పంచుకున్నారు. వెంకటేష్, నాగార్జున అమెరికాలో చదువుకున్నారు... ఇంట్లోవారి బలవంతంతో అయిష్టంగానే సినిమాల్లోకి వచ్చినా అగ్రహీరోలుగా ఎదిగారు అని కోడి రామకృష్ణ తెలిపారు.

    ఆ హీరో కంటే చిరంజీవిని అవమానిస్తే వర్కౌట్ అవుతుందని చెప్పా!ఆ హీరో కంటే చిరంజీవిని అవమానిస్తే వర్కౌట్ అవుతుందని చెప్పా!

    రక్తం కారినా బాలయ్యకు అదే పట్ట

    రక్తం కారినా బాలయ్యకు అదే పట్ట

    బాలయ్యకు మంచి సబ్జెక్టు దొరికితే దానికి ఇక ఎవరూ పనికి రారు అనే రేంజిలో చేస్తారు. భయంకరమైన పట్టుదల ఉన్న మనిషి. ఆ రోజుల్లో సీఎంగా ఆయన ఫాదర్ ఉన్నాసరే మాతో చాలా స్నేహంగా ఉండేవారు. ఓసారి బాలకృష్ణ, విజయశాంతిపై నర్సరీలో సాంగ్ షూట్ చేశాం. డాన్స్ మూమెంట్స్ చేస్తుండగా నర్సరీలో కట్ చేసిన చెట్ల మొదలు ఒకటి ఆయన కాలులో దిగి పోయింది. కాలు రావడం లేదు. తీవ్రమైన రక్తస్రావం. డాక్టర్లను తీసుకొస్తే చుట్టూ ఉన్న నేలను తవ్వి దాన్ని బయటకు తీసి... ఆ తర్వాత ఆయన కాలు నుండి దాన్ని తీసేశారు. కట్టు కట్టిన వెంటనే బాలయ్య నెక్ట్స్ ఏమిటి? అంటూ షాటుకు రెడీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎందుకు బాలయ్యా? అంటే వినలేదు. ఈ రోజు పూర్తి కావాల్సిన షూటింగ్ పూర్తి కావాల్సిందే అంటూ ఫినిష్ చేశారు. కృష్ణగారు కూడా అంతే. ఆయన ఎంటరయ్యారంటే సాయంత్రం వరకు సీన్లు అయిపోవాల్సిందే. టపా టపా చేసేస్తారు.... అని కోడి రామకృష్ణ తెలిపారు.

    హీరో రాజశేఖర్‌ను కంట్రోల్ చేయలేం...

    హీరో రాజశేఖర్‌ను కంట్రోల్ చేయలేం...

    హీరో రాజశేఖర్‌తో సినిమా చేస్తే అతడిని మనం కంట్రోల్ చేయలేం. అంకుశంలో ఫ్లవర్ బోకేలో బాంబు పెట్టిన సీన్లో జీప్ డ్రైవ్ చేసుకుంటూ వస్తారు. సీన్ పూర్తయిన తర్వాత దాన్ని ఆపకుండా వచ్చేస్తే అందరం కలిసి దాన్ని ఆపాం. సెట్స్‌లో ఆయన చాలా ఎమోషనల్ గా ఉంటారు... అని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.

    సౌందర్య మరణంతో షాకయ్యా

    సౌందర్య మరణంతో షాకయ్యా

    సౌందర్య చాలా మంచి అమ్మాయి. సెట్స్‌లో ఎలాంటి ఇబ్బంది పెట్టేది కాదు. తన పాత్ర బాగా రావాలని, తన యాక్టింగుకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టాలని తపన పడేది. ఆమె చనిపోయిన విషయం తెలిసి షాకయ్యాను అని కోడి రామకృష్ణ తెలిపారు.

    వెంకటేష్‌కు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు

    వెంకటేష్‌కు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు

    వెంకటేష్‌తో శ్రీనివాస కళ్యాణం నా తొలి సినిమా. మురారిగారు నిర్మాత. ఆయనకు తొలినాళ్లలో సినిమాల్లో రావడం ఇష్టం ఉండేది కాదు. నేను ఎక్కడో అమెరికాలో ఉండేవాన్ని... మా నాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేషాలు వేయమని కూర్చోబెట్టారు. నాకు టెన్షన్ గా ఉంది అనేవారు... అని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.

    నాగార్జునలో ఉన్న గొప్పదనం అదే

    నాగార్జునలో ఉన్న గొప్పదనం అదే

    నాగార్జున కూడా అంతే... అమెరికాలో కలర్‌ఫుల్‌గా నా జీవితం ఉండేది, నాన్నగారు ఇక్కడకు తీసుకొచ్చారు అని చెప్పేవారు. లేదు బాబూ సినిమా లైఫ్ ఇంకా బావుంటుంది అని చెప్పేవాన్ని. కానీ అమెరికాలో ఇంకా బావుండే వాన్ని కదా అని నాగార్జున చెప్పేవారు. ఆయనలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... మా నాన్నగారి గ్లామర్ తగ్గించకూడదు, నాన్నగారిలాగా ఉండాలి, ఆయనకు మంచి పేరు తేవాలి అని తపనపడేవాడు. చాలా నైస్ పర్సన్, ప్రౌడ్ ఉండదు, ఫ్రెండ్లీగా మాట్లాడేవారు, ఇప్పటికీ అలాగే ఉంటారు అని కోడి రామకృష్ణ తెలిపారు.

    English summary
    Kodi Ramakrishna interesting comment on Balakrishna and Nagarjuna. Kodi Ramakrishna is an Indian film director and writer known for his works predominantly in Telugu cinema, and a few Tamil, Malayalam and Hindi films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X