ఆ హీరో కంటే చిరంజీవిని అవమానిస్తే వర్కౌట్ అవుతుందని చెప్పా!

By Bojja Kumar

Recommended Video

Kodi Ramakrishna Memorises His Thoughts About Chiranjeevi

నిన్నటితరం తెలుగు దర్శకుల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి కోడి రామకృష్ణ. చిరంజీవి హీరోగా వచ్చిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోడి రామకృష్ణ.... చిరంజీవి గురించి, ఆయన కథలు ఎంచుకునే తీరు ఎలా ఉంటుంది? ఈ రోజు మెగాస్టార్‌గా ఎదగడం వెనక కారణాలు ఏమిటి? అనే పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

నా సినిమాకు చిరంజీవి కావాలని పట్టుబట్టాను

నా సినిమాకు చిరంజీవి కావాలని పట్టుబట్టాను

చిరంజీవిలో ఉండే నేచర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన పట్టుదల ఉన్న మనిషి. బాగా యాక్ట్ చేయాలి, ఏదైనా సాధించాలి అని యాంబిషన్ ఉన్న మనిషి. అందుకే నా తొలి సినిమా కథ నిర్మాత రాఘవకు చెప్పగానే ఎవరు హీరో? అన్నారు. చిరంజీవిని అనుకుంటున్నానండీ, ఆయన అయితేనే నా కథకు సరిపోతారండీ అని చెప్పాను... అని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.

మా హీరోను కాదని చిరంజీవి ఎందుకు? అని నిలదీశారు

మా హీరోను కాదని చిరంజీవి ఎందుకు? అని నిలదీశారు

మా సంస్థకు కొందరు హీరోలు ఉన్నారు... వారిని కాకుండా చిరంజీవిని ఎలా తీసుకుంటావు? అని నిర్మాత రాఘవ ప్రశ్నించారు. అపుడు నేను ఒకటే చెప్పాను... నా కథకు ఆయనైతేనే బావుంటుంది అని చెప్పాను. దీంతో మరుసటిరోజు పెద్దోళ్లందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. మరుసటిరోజు మీటింగ్ మొదలైంది. పెద్దలందరిముందు ముద్దాయిలా నేను నిల్చున్నాను. వారిని కన్విన్స్ చేశాను కాబట్టే చిరంజీవితో చేయడానికి ఒప్పుకున్నారు అని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.

ఆ హీరో కంటే చిరంజీవిని అవమానిస్తే వర్కౌట్ అవుతుందని చెప్పా!

ఆ హీరో కంటే చిరంజీవిని అవమానిస్తే వర్కౌట్ అవుతుందని చెప్పా!

ఎందుకు నా హీరోను కాదని చిరంజీవిని అనుకుంటున్నావు అని ఆ మీటింగులో నన్ను అడిగారు. ‘నా సినిమా భార్య భర్తను అనుమానించడం, అవమానించడం. అది మీరు చెప్పిన హీరో కంటే చిరంజీవిని అవమానిస్తే అందరు ఆడోళ్లు థ్రిల్ అవుతారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఏంటీ ఈ అమ్మాయి ఇలా చేస్తుందనే ఒక ఫీలింగుకు వస్తారు. అన్ని జనరేషన్లకు నచ్చిన స్టార్ చిరంజీవి. అప్పట్లో ఆయన పెద్ద స్టార్ కాదు...ఆయనకు ఉన్న టాలెంట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన్ను చూసి ఆడవారు ఎందుకు ఇంత గొప్పవాన్ని అనుమానిస్తుంది? అనే ఫీలింగ్ వచ్చి సినిమా స్పాన్ పెరుగుతుందని చెప్పాను. దానికి నిర్మాత రాఘవ కన్విన్స్ అయి ఓకే చెప్పారు అని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.

 రెమ్యూనరేషన్ గురించి ఆలోచించలేదు

రెమ్యూనరేషన్ గురించి ఆలోచించలేదు

రాఘవగారు ఒకే చెప్పగానే చిరంజీవిగారిని వెళ్లి కలిశాను. ఆయన్ను కలవడం అదే తొలిసారి. అపుడు రెమ్యూనరేషన్ గురించి చిరంజీవిగారు రాఘవగారితో ఒకటే చెప్పారు. రేటు గురించి నాకు వద్దు, మీరు ఇస్తే ఇవ్వండి లేక పోతే లేదు. ఈ కొత్త కొర్రాన్ని ఎంకరేజ్ చేయాలి... అందుకని నేను చేస్తున్నాను అని చెప్పి నాకో కండీషన్ పెట్టారు. కథ నచ్చితేనే చేస్తాను అన్నారని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.

అలా ఆలోచిస్తారు కాబట్టే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు

అలా ఆలోచిస్తారు కాబట్టే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు

కథ విన్న తర్వాత నా క్యారెక్టర్ చాల్లేదు అన్నారు. కానీ పూర్ణిమ క్యారెక్టర్ నచ్చింది, సంగీత క్యారెక్టర్ నచ్చింది. ఆడోళ్లందరూ లైక్ చేస్తారు. ఈ రెండు క్యారెక్టర్లకు మధ్యలో ఉండి నా క్యారెక్టర్ హెల్ప్ చేస్తుంది. విలన్ క్యారెక్టర్ కూడా నచ్చింది. నా పాత్ర సెంటర్ పాయింట్ కాబట్టి నేను చేస్తున్నాను అన్నారు. ఆయన క్యారెక్టర్ నచ్చక పోయినా పక్క క్యారెక్టర్లు నచ్చి ఈ సినిమా చేయడం ఎంతో గొప్ప విషయం. నా క్యారెక్టర్, నేనే అని చూసుకోకుండా ఆయన అలా ఆలోచిస్తారు కాబట్టే ఈ రోజు గొప్ప మెగాస్టార్ అయ్యారు అని కోడి రామకృష్ణ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X