బయోపిక్స్ తీయొద్దనేది నా ఆలోచన: ఎన్టీఆర్ బయోపిక్‌పై కోడి రామకృష్ణ ఆఖరి మాట!

Recommended Video

Kodi Ramakrishna Last Words About NTR Biopic | Filmibeat Telugu

శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర సీమను విషాదంలోకి నెట్టివేశాయి. ఆయన చివరి చూపుకోసం వస్తున్న పలువురు ప్రముఖులు కోడి రామకృష్ణతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైన రోజే కోడి రామకృష్ణ అస్తమించడం చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో తన అనుబంధం గురించి, బాలయ్య తీస్తున్న బయోపిక్ గురించి రామకృష్ణ చెప్పిన మాటలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

కోడి రామకృష్ణ

కోడి రామకృష్ణ

బాలయ్యతో సినిమా చేసేపుడు రామారావు గారు కలిసేవారని కోడి రామకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ‘ఆయన నాతో చాలా స్నేహంగా ఉండేవారు. ఏమిటి జీవితం, ఎలా ఉండాలి అని చెబుతుండేవారు. ఆసమయంలో ఆయన్ను ఓ విషయం అడిగాను. సార్.. నేను అందరు హీరోలతో చేశాను, మీతో చేయలేదు. అది నిజంగానే లోపంగా ఉండిపోయిందని అన్నాను. అందుకు రామారావు స్పందిస్తూ... లోపంగా ఎందుకు ఉండాలి. నేను మళ్లీ సినిమలు చేస్తాను. తప్పకుండా మీకు అవకాశం వస్తుంది. కథ చెప్పండి సీఎం అయినా సరే నేను చేస్తాను అన్నారు.' అని రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.

అలా ఆ సినిమా మిస్సయింది

అలా ఆ సినిమా మిస్సయింది

సీఎంగా రామారావు ఒకసారి డ్రాప్ అయిన తర్వాత ఒక కథ చెప్పాను. మురళీ మోహన్ గారు దాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఒక తాతగారు, తాతగారు డిఫీట్లో ఉండటం, ఫారిన్ నుంచి మనవడు వచ్చి తాతగారికి సపోర్టుగా నిలబడటం, తాతగారిని మళ్లీ గెలిపించి.. ఫారిన్ వెళ్లకుండా ఇండియాలోనే ఉండి దేశానికి సేవ చేస్తాను అనే కథ చెప్పాను. ఆయన విని సూపర్‌గా ఉంది, మా కథే చెప్పారు. ఇదే చేస్తాను అన్నారు. ఆ స్క్రిప్టు రెడీ చేసిన తర్వాత రామారావుగారు మళ్లీ సీఎం అయ్యారు. సీఎం అయ్యాక కూడా ఎప్పటికైనా చేస్తాను. నువ్వు డిసప్పాయింట్ అవ్వొద్దని చెప్పినట్లు... కోడి రామకృష్ణ గత ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆయనతో చేయలేదనే వెలితి లేదు

ఆయనతో చేయలేదనే వెలితి లేదు

‘భారత్ బంద్' సినిమా చేస్తున్నపుడు ఆయన దగ్గరకు వెళ్లి మీతో సినిమా చేయలేక పోయాను మా సినిమా ఫంక్షన్‌కు రండి అని ఆహ్వానించారు. లలితకళాతోరణంలో ఫంక్షన్ చేస్తే వచ్చారు. అది చాలు అనిపించింది. రామారావుగారితో చేయలేదనే వెలితి అయితే లేదు.. అని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.

బయోపిక్స్ తీయొద్దనేది నా ఆలోచన

బయోపిక్స్ తీయొద్దనేది నా ఆలోచన

రామారావుగారి బయోపిక్ తీద్దామనైతే ఎప్పుడూ అనుకోలేదు. పెద్దవారిది ఏదైనా అది ఒక జ్ఞాపకంగానే ఉండిపోవాలి. మళ్లీ దాన్ని సినిమా కింద చూపిస్తే ఏదైనా లోపంగా ఉంటుందేమో? ఊహలలో ఉంటే ఎంత స్పాన్ అయినా ఉంటుంది. సినిమాగా తీస్తే ఆ ఊహను తగ్గించేస్తామేమో? అనే ఫీలింగ్ ఉండేది. కానీ బాలయ్యే ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నాడు అన్నపుడు సంతోషంగా అనిపించింది. తండ్రి రుణం తీర్చుకుంటున్నాడనిపించింది. అతడే సమర్థుడు అనిపించింది. బాలయ్య ఆలోచనను అప్రిషియేట్ చేశాను... అని కోడి రామకృష్ణ తెలిపారు.

బాలయ్యకు చెప్పాను

బాలయ్యకు చెప్పాను

బయోపిక్ అనౌన్స్ చేసిన వెంటనే బాలయ్యకు ఒక విషయం చెప్పాను. బాలయ్యా.. అందరు కొడుకులు ఉంటారు. అందరు కొడుకులూ ఎంజాయ్ చేస్తారు. ఆస్తులు పంచుకుంటారు, పేరు పంచుకుంటారు. నిజంగా రామారావు రుణం నువ్వు తీర్చుకుంటున్నావని చెప్పాను... అని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X