రక్తానికి అతీతమైన బంధం.. డైరెక్టర్ గారు అనగానే, చంపేద్దాం గురువు గారు.. బాలకృష్ణ ఎమోషనల్

ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని బాలకృష్ణ, మోహన్‌బాబు, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారేమన్నారంటే..

కోడి రామ‌కృష్ణ మ‌ర‌ణం తీర‌ని లోటు

కోడి రామ‌కృష్ణ మ‌ర‌ణం తీర‌ని లోటు

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ‌గారు అనారోగ్యంతో క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రం. శ‌తాధిక ద‌ర్శ‌కుడిగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు చిత్ర సీమ‌కు అందించారాయ‌న‌. ఎమోష‌న‌ల్ చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో కోడి రామ‌కృష్ణ‌గారు ముందు వ‌రుస‌లో ఉంటారు. అలాగే ఆయ‌న వైవిధ్య‌మైన చిత్రాల‌ను కూడా అందించారు. ట్రెండ్‌కు త‌గిన‌ట్లు గ్రాఫిక్స్ చిత్రాల‌ను కూడా అద్భుతంగా తెర‌కెక్కించారు. ఆయ‌న‌తో క‌లిసి మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ముద్దుల క్రిష్ణ‌య్య‌, ముద్దుల మావ‌య్య, ముద్దుల మేన‌ల్లుడు, భార‌తంలో బాల‌చంద్రుడు, మువ్వ గోపాలుడు, బాల‌గోపాలుడు చిత్రాల‌కు ప‌నిచేశాను. ఇలాంటి గొప్ప ద‌ర్శ‌కుడిని కోల్పోవ‌డం సినీ ప‌రిశ్రమ‌కు తీర‌నిలోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని ప్రార్థిస్తున్నాను.

మరణం బాధాకరం

మరణం బాధాకరం

నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి మ‌ర‌ణం బాధాక‌రం. తెలుగు సినిమా ఓ మంచి ద‌ర్శ‌కున్ని కోల్పోయింది. తెర‌పై ఆయ‌న ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాంటి ద‌ర్శ‌కుడు క‌న్నుమూయ‌డం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటు. ఆయ‌న‌తో నేను కూడా కొన్ని సినిమాల‌కు ప‌ని చేసే గౌర‌వం ద‌క్కింది. శ్రీ కోడి రామ‌కృష్ణ గారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను అని ఓ ప్రకటనలో మంచు మోహన్‌బాబు పేర్కొన్నారు.

తీరని లోటు

తీరని లోటు

ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉత్తమ దర్శకుడు, పరిశ్రమలో అందరికీ ఎంతో ఆప్తుడు, నాకు మంచి మిత్రులు కోడి రామకృష్ణ గారు లేకపోవడం పరిశ్రమకి ఎప్పటికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలుపుతున్నాను అని క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె ఎస్ రామారావు అన్నారు.

 నాకు అత్యంత ఆత్మీయులు

నాకు అత్యంత ఆత్మీయులు

కోడి రామకృష్ణ నాకు ఆత్మీయులు. ఇండస్ట్రీలో అందరికీ మంచి మిత్రులు. అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. మా దుర్గ ఆర్ట్స్ బ్యానర్లో 'దొంగాట' లాంటి శతదినోత్సవ చిత్రాన్ని ఇచ్చారు. ఎప్పుడు కలిసినా 'ఎం డైరెక్టర్ గారు అనగానే...చంపేద్దాం గురువు గారు' అనేవారు. అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవారు. దేనికైనా ఆయన ఉత్సాహంగా ముందుండే వారు. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా లోటు. వ్యక్తిగతంగా మంచి మిత్రున్ని కోల్పోయాను. పరిశ్రమకు కూడా తీరని లోటు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ప్రముఖ నిర్మాత, నిర్మాతల మండలి అధ్యక్షులు డాక్టర్ కెఎల్ నారాయణ అన్నారు.

రక్తానికి అందని బంధం

రక్తానికి అందని బంధం

దర్శకుడు కోడి రామకృష్ణ మరణంపై నటుడు, రచయిత తోటపల్లి మధు స్పందించారు. నా చిన్న గురువు గారిని పెద్ద అన్నయ్యని రక్తానికి అందని అనుబంధాన్ని పోగొట్టుకున్నాను ,ఇంకా దేవుడిలోనే కోడి రామకృష్ణ ను చూసుకుంటాను అని తోటపల్లి మధు అన్నారు.

కోడిరామ‌కృష్ణ‌గారు స్ఫూర్తి ప్ర‌ధాత‌

కోడిరామ‌కృష్ణ‌గారు స్ఫూర్తి ప్ర‌ధాత‌

తెలుగు సినిమా చరిత్ర‌లో వంద చిత్రాల‌కు పైగా దర్శ‌క‌త్వం వ‌హించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుభ‌వంలో కోడి రామ‌కృష్ణ‌గారు ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను అందించారు. ఇప్ప‌టికీ ఆయ‌న తీసిన చిత్రాలు మ‌ర‌చిపోలేం. ఎమోష‌న‌ల్ మూవీస్‌, భ‌క్తిచిత్రాలు, పొలిటిక‌ల్ మూవీస్ ఇలా అన్నీ ర‌కాల చిత్రాల‌ను తెర‌కెక్కించారు. తన చిత్రాల‌తో నేటి ద‌ర్శ‌కుల‌కు స్ఫూర్తి ప్ర‌దాత‌గా నిలిచారు కోడిరామ‌కృష్ణ‌గారు. ఇలాంటి గొప్ప ద‌ర్శ‌కుడు మ‌న‌ల్ని విడిచి పెట్టి వెళ్లిపోవ‌డం బాధాకరం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి.. వారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.

కోడి రామ‌కృష్ణ‌గారి మ‌ర‌ణ‌వార్త నన్నెంతో బాధించింది

తెలుగు చిత్ర సీమ ఓ గొప్ప ద‌ర్శ‌కుడ్ని కోల్పోయింది. ఇలాంటి ద‌ర్శ‌కులు అరుదుగా పుడుతుంటారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త నన్నెంతో బాధించింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఆ దేవుడు ధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నాను అని శర్వానంద్ ఓ ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X