బైపాస్ సర్జరీ... కోలుకుంటున్న దర్శకుడు కోడి
కోడి రామకృష్ణ సినిమా విషయాలకొస్తే...
కోడి రామకృష్ణ దర్శకత్వంలో పుట్టపర్తి సాయిబాబా మహిమలతో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సౌభాగ్య చిత్ర పతాకంపై నిర్మాణం అవుతున్న ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ మలయాళ హీరో దిలీప్‌ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కరాటం రాంబాబు.
దర్శకుడు కోడి రామకృష్ణ సాయి భక్తులను స్వయంగా కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకుని ఈ చిత్రం కథ సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రంలో సత్య సాయి బాబాను ఆరునెలలు ప్రాయం నుంచి 85 ఏళ్ళ ప్రాయం వరకు వివిధ వయసుల్లో చూపెట్టనున్నారు.
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మొత్తం ఇందులో 14 పాటలున్నాయి. అన్నీ కథాగమనంలో కలిపోతూ సాగుతాయి. ఈ చిత్రంలో బాబా తల్లిగా జయప్రద, తండ్రిగా శరత్‌బాబు నటిస్తున్నారు. శ్రీజిత్, సుకుమారి, కె.వి.రమణాచారి, విజయ్, లక్ష్మి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి నిర్మాత: కరాటం రాంబాబు, దర్శకత్వం: కోడి రామకృష్ణ, సినిమాటోగ్రాఫర్: వాసు, సంగీతం: ఇళయరాజా, రచన: రాజేంద్రకుమార్, సాహిత్యం: జొన్నవిత్తుల, కళ: నాగు, ఎడిటర్: నందమూరి హరి.


Click it and Unblock the Notifications












