twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బైపాస్ సర్జరీ... కోలుకుంటున్న దర్శకుడు కోడి

    By Bojja Kumar
    |

    చెన్నై: దర్శకుడు కోడి రామకృష్ణ అస్వస్థత కారణంగా శుక్రవారం చెన్నయ్ లోని విజయఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్యులు ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో 24 గంటల్లో ఆయన్ను డిశ్చార్జి చేస్తామని విజయ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

    కోడి రామకృష్ణ సినిమా విషయాలకొస్తే...
    కోడి రామకృష్ణ దర్శకత్వంలో పుట్టపర్తి సాయిబాబా మహిమలతో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సౌభాగ్య చిత్ర పతాకంపై నిర్మాణం అవుతున్న ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ మలయాళ హీరో దిలీప్‌ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కరాటం రాంబాబు.

    దర్శకుడు కోడి రామకృష్ణ సాయి భక్తులను స్వయంగా కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకుని ఈ చిత్రం కథ సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రంలో సత్య సాయి బాబాను ఆరునెలలు ప్రాయం నుంచి 85 ఏళ్ళ ప్రాయం వరకు వివిధ వయసుల్లో చూపెట్టనున్నారు.

    ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మొత్తం ఇందులో 14 పాటలున్నాయి. అన్నీ కథాగమనంలో కలిపోతూ సాగుతాయి. ఈ చిత్రంలో బాబా తల్లిగా జయప్రద, తండ్రిగా శరత్‌బాబు నటిస్తున్నారు. శ్రీజిత్‌, సుకుమారి, కె.వి.రమణాచారి, విజయ్‌, లక్ష్మి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి నిర్మాత: కరాటం రాంబాబు, దర్శకత్వం: కోడి రామకృష్ణ, సినిమాటోగ్రాఫర్: వాసు, సంగీతం: ఇళయరాజా, రచన: రాజేంద్రకుమార్, సాహిత్యం: జొన్నవిత్తుల, కళ: నాగు, ఎడిటర్: నందమూరి హరి.

    English summary
    Director Kodi Ramakrishna was hospitalized on Friday after he complained of chest pain. The senior director is now undergoing treatment at Vijaya Hospital in Chennai. The doctors said that he's out of danger and have advised him some rest for a few days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X