Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
కోడి దర్శకత్వంలో అర్జున్-లక్ష్మీరాయ్ ‘రాణి రాణమ్మ’
హైదరాబాద్: దర్శకుడు కోడి రామకృష్ణ నాలుగేళ్ల క్రితం అరుంధతి సినిమా రూపొందించిన సంచలన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన దివంగత సత్యసాయి బాబాపై జీవిత చరిత్రపై సినిమా మొదలు పెట్టినప్పటికీ ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు.
తాజాగా ఆయన మరో ప్రాజెక్టు చేయడానికి సిద్ధం అయ్యారు. 'రాణి రాణమ్మ' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం అర్జున్, లక్ష్మీరాయ్ ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు. ఏప్రిల్ 15న ఈచిత్ర ప్రారంభోత్సవం జరుగనుంది. శైలజా ప్రొడక్షన్స్ బేనర్ పై ఆర్. రామచంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఫ్యామిలీ డ్రామా కథాంశంతో సాగే ఈచిత్రం కథ ఇద్దరు దంపతులు, వారి పిల్లల చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ నెల 15న సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
తెలుగు, తమిళం, కన్నడం మూడు భాషల్లో రూపొందనున్న ఈచిత్రం గత సంవత్సరమే ప్రారంభం కావాల్సి ఉండగా కోడి రామకృష్ణ అనారోగ్యం పాలుకావడంతో సినిమా నిలిచి పోయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో సినిమాను ఈ నెల 15న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.