నటుడు అవుదామని డైరెక్టర్‌గా.. గురువు అడుగుజాడల్లో.. హీరోగా చేదు అనుభవం!
సినిమా పరిశ్రమలో డాక్టర్ కావాలనుకొని యాక్టర్‌ను అయ్యాను అనే మాట తరుచుగా వినిపిస్తుంటుంది. చాలా మంది ఇండస్ట్రీలో ఏదో రంగంలో రాణిద్దామనుకొని వచ్చి మరో రంగంలో గొప్పవాళ్లుగా మిగిలిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కోడి రామకృష్ణకు అదే జరిగింది. తొలుత నటుడిగా ప్రయత్నిద్దామని మద్రాస్ ట్రైన్ ఎక్కిన కోడి రామకృష్ణ అనూహ్యంగా టాలీవుడ్‌లోనే దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు. వివరాల్లోకి వెళితే..

విద్యార్థిగా ఉన్నప్పుడే
పాలకొల్లులో విద్యార్థిగా ఉన్న సమయం నుంచే పలువురు దర్శకులకు ఫొటోలు పంపేవారట. వాటికి సమాధానం రాకపోయినా అలాగే పట్టు వదలకుండా ఫొటోలను పంపిన దాఖలాలు ఉన్నాయి. అయితే దాసరి నారాయణరావు రూపొందించిన తాత మనవుడు సినిమా చూశాక దర్శకుడిగా మారాలనే నిర్ణయించుకొన్నారట.

కోడి రామకృష్ణకు దాసరి అండగా
కోడి రామకృష్ణకు నటనపట్ల ఆసక్తిని గమనించిన దర్శకుడు దాసరి నారాయణరావు ఆయనకు రాధమ్మ పెళ్లి చిత్రంలో ఓ పాత్రను ఇచ్చి నటింపజేశారు. ఆ తర్వాత దాసరి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే అప్పుడప్పుడు తెరమీద కనిపించేవారు. స్వర్గం నరకం చిత్రంలో అక్కినేని అభిమానిగా, ఎవరికి వారే యమునా తీరే చిత్రాల్లో నటించారు.
విద్యార్థి నాయకుడిగా
విద్యార్థి దశలో పాలుకొల్లులో స్టూడెంట్ యూనియన్లలో చురుకుగా పాల్గొనేవారు. కోడి రామకృష్ణ నాయకత్వ లక్షణాలను చూసిన ప్రముఖ నిర్మాత రాఘవ తాను రూపొందించిన చదువు సంస్కారం సినిమాలో విద్యార్థి నాయకుడి పాత్రను ఇచ్చారు. ఇలా చిన్న చితక పాత్రలతో తన నటనపై ఉండే కోరికను తీర్చుకొన్నారు.

సుహాసినితో హీరోగా నటించిన
దర్శకుడిగా స్థిరపడిన తర్వాత కోడి రామకృష్ణ హీరోగా మారారు. తన గురువు దాసరి అడుగు జాడల్లో నడుస్తూ మా ఇంటికి రండి చిత్రంలో కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి సుహాసిని హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ చిత్రం విజయవంతం కాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రలు ధరించారు.


Click it and Unblock the Notifications











