'నయన్' స్థానంలో 'హన్సిక'
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల హవా నడుస్తోంది. 'మంత్ర', 'అనసూయ', 'అరుంధతి' వంటి చిత్రాల విజయాలతో ఇలాంటి చిత్రాల నిర్మాణం ఊపందుకొంది. ప్రస్తుతం భూమిక, స్నేహల కాంబినేషన్ లో రవిబాబు దర్శకత్వంలో 'అమరావతి', ఆర్తి అగర్వాల్ 'నీలవేణి' లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు సెట్స్ పైన ఉన్నాయి.
తాజాగా విజయం కోసం చకోర పక్షి లాగా ఎదురుచూస్తున్న యం.యస్.రాజు కూడా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించే పనిలో వున్నారు. 'అరుంధతి' చిత్రాన్ని తీసిన కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తొలుత నయనతారను కథానాయికగా అనుకున్నారు. కానీ ఇప్పుడా అవకాశం హన్సికను వరించినట్టు సమాచారం. హన్సిక ఇంతకు ముందు యం.యస్.రాజు నిర్మించిన 'మస్కా' చిత్రంలో నటించింది. ఇంతవరకూ కేవలం గ్లామర్ డాల్ పాత్రల్లో నటించిన హన్సికకు ఇదొక సువర్ణావకాశం. అలాగే కోడి రామకృష్ణ, యం.యస్.రాజుల కాంబినేషన్ లో వచ్చిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 'దేవీ' అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











