నయనతార సినిమాపై ప్రియుడి సంచలన వ్యాఖ్యలు.. కేసు పెడతా అంటూ నిర్మాత ఫైర్!

నయనతార నటించిన కొలయుతిర్ కాలం చిత్రం విషయంలో వివాదం నెలకొంది. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ పై ఈ చిత్ర నిర్మాత మథియా లగాన్ మండిపడుతున్నాడు. విగ్నేష్ శివన్ కొలయుతిర్ కాలం చిత్రానికి నష్టం చేకూరే విధంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని మథియా లగాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చక్రి తోలేటి ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలో విగ్నేష్ శివన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు.

నెగిటివ్ ప్రచారం

నెగిటివ్ ప్రచారం

విగ్నేష్ శివన్ ఇటీవల కొలయుతిర్ కాలం చిత్రం గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రం అసంపూర్ణంగా చిత్రీకరించారని విగ్నేష్ వ్యాఖ్యానించాడు. దీనితో కొలయుతిర్ కాలం చిత్రానికి విడుదలకు ముందే నెగిటివ్ ప్రచారం మొదలైంది. విగ్నేష్ శివన్ వ్యాఖ్యలు తనకు ఆర్థికంగా నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని నిర్మాత అంటున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. చిత్ర అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది. విగ్నేష్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో అర్థం కావడం లేదు.

బయ్యర్లు తప్పుకునే అవకాశం

బయ్యర్లు తప్పుకునే అవకాశం


విగ్నేష్ శివన్ వ్యాఖ్యల వలన ఈ చిత్రాన్ని కొనేందుకు ఆసక్తి చూపేబయ్యర్లు కూడా వెనక్కు తగ్గే అవకాశం ఉంది. కొలయుతిర్ కాలం చిత్రాన్ని ఎవరూ కొనకుంటే నా పరిస్థితి ఏంటని నిర్మాత అంటున్నారు. జరిగిన నష్టాన్ని భర్తీ చేయకుంటే విగ్నేష్ శివన్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మథియా లగాన్ అన్నారు. ఈ చిత్ర డిజిటల్ హక్కులకు మంచి డిమాండ్ నెలకొని ఉంది. కానీ విగ్నేష్ వ్యాఖ్యల తర్వాత ఎవరూ ఆసక్తి చూపడం లేదని అన్నారు.

రాధా రవి వ్యాఖ్యలు

రాధా రవి వ్యాఖ్యలు


గత వారం కూడా కొలయుతిర్ కాలం చిత్రం వార్తల్లో నిలిచింది. ప్రముఖ సీనియర్ నటుడు రాధారవి మాట్లాడుతూ.. కొలయుతిర్ కాలం చిత్రంలో నయనతార పాత్ర గురించి కామెంట్ చేశాడు. నయనతారని చూస్తే దెయ్యాలే పారిపోతాయి. ఆమె మళ్ళీ దెయ్యం పాత్రలో నటిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాధారవి వ్యాఖ్యలపై తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

విరుచుకుపడ్డ ప్రముఖులు

విరుచుకుపడ్డ ప్రముఖులు


నయనతారపై చేసిన వ్యాఖ్యలతో హీరో విశాల్, పలువురు హీరోయిన్లు, దగ్గుబాటి రానా రాధారవిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. విశాల్ స్పందిస్తూ.. రాధారవి పేరులో నుంచి రాధా అనే పేరు తొలగించాలి అని అన్నారు. మహిళలపై కనీసం గౌరవం లేని అతడు మహిళల పేర్లు పెట్టుకునే అర్హత లేదని వ్యాఖ్యానించాడు.తరచుగా వివాదాల్లో నిలుస్తున్న ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్ గా రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X