ధనుష్ ని మహేష్ కాపీ కొట్టడం లేదని ఖండన
ధనుష్ సూపర్ హిట్ సాంగ్ కొలావరి డి తరహాలో మహేష్ చేత ది బిజనెస్ మ్యాన్ లో ఓ పాట పాడిస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాట పాడించటం నిజమే కానీ, ఆ పాటకి,తాము ట్యూన్ చేసే పాటకి సంభందం లేదంటున్నాడు సంగీత దర్శకుడు ఎస్. ఎస్ తమన్. ఆయన మాట్లాడుతూ..మా పాట ఓ ధీమ్ సాంగ్., కొన్ని డైలాగులు,ర్యాప్ లైన్స్ తో రాకింగ్ బీట్స్ తో ఉంటుంది. ఈ పాట పూర్తిగా కొత్త జనర్ కి చెందిన పాట అవుతుంది. అదే ఈ చిత్రానికి ధీమ్ మ్యూజిక్ అవుతుంది.అళాగే ఈ పాట కోసం అనుకున్న డైలాగులు చాలా కాలం క్రితం రాసినవే. అంతేగానీ ధనుష్ పాట చూసి ప్రేరణ పొందినవి కాదు అన్నారు. ఇక బిజినెస్ మ్యాన్ పాటలు డిసెంబర్ 18 న విడుదల అవుతాయి. వెన్యూ, తదితర వివరాలు త్వరలోనే సినిమా యూనిట్ వారు చెప్తారు అన్నారు.
ఇక ది బిజెనెస్ మ్యాన్ విషయానికి వస్తే...ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











