50 మిలియన్ల హిట్స్‌కు చేరిన ధనుష్ 'కోలవెరి ఢీ'
దేశం మొత్తానికి పాకిన 'కోలవెరి ఢీ' పాట సోమవారం ప్రముఖ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌లో 50,086,633 హిట్లకు చేరుకుంది. ఈ పాటను సౌతిండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ అల్లుడు ధనుష్ పాడిన విషయం తెలిసిందే. నవంబర్ 16వ తారీఘున అధికారకంగా ఈ పాటను ఇంటర్నెట్లో విడుదల చేశారు. విడుదలైన అతి కొద్ది రోజుల్లో దేశం మొత్తం ఓ వైరస్‌లా ఈ పాట పాకింది.
వయసుతో సంబంధం లేకుండా ఈ కోలవెరి ఢీ పాటను హామ్ చేశారు. ఈ పాటకున్న ప్రత్యేకత ఏమింటటే పదాలు ఇంగ్లీషు, తమిళ కలబోతతో ఉండడమే కాకుండా కామన్ మ్యాన్‌కి అర్దమయ్యే రీతిలో ఉన్నాయి. ధనుష్ భార్య సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా పేరు '3'.
ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు 21 సంవత్సరాలు వయసున్న అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. కోలవెరి ఢీ పాటకు అనుగుణంగా ధనుష్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌పై తనదైన శైలిలో పాటను కంపోజ్ చేశాడు. ఈ పాటను సచిన్‌కు అంకితమిచ్చాడు.


Click it and Unblock the Notifications











