Don't Miss!
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రోజా.. తర్వాత ఇన్నేళ్లకు ‘కొలవెరి’ కొట్టేసింది!
రజనీకాంత్ అల్లుడు ధనుష్ పాటకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'టైమ్స్'కవర్ పేజీపై చోటు దక్కింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ హిట్ 'రోజా' సినిమా టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు దక్కించుకోగా....దాదాపు 20 ఏళ్ల తర్వాత 'కొలవెరి' పాట ఆ స్థానాన్ని కొట్టేసింది. తాను కంపోజ్ చేసిన తొలి పాటకు అంతర్జాతీయ ఖ్యాతి రావడంపై మ్యూజిషియన్ అనిరుధ్ రవిచందర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన రోజా సినిమా తర్వాత తన పాటకు ఇలాంటి గౌరవం దక్కడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు.
తమిళ హీరో ధనుష్ తన భార్య దర్శకత్వంలో వస్తున్న '3'సినిమాకు గాను స్వయంగా 'కొలవెరి'పాటను రాసి పాడారు. ఈ పాట అనతి కాలంలోనే మోస్ట్ పాపులారిటీ సంపాదించింది. పది రోజుల్లోపే ఈ పాట యూట్యూబ్ లో కోటి క్లిక్స్ దాటడంతో...యూట్యూబ్ గోల్డ్ లిస్టులో చోటు దక్కించుకుంది. ఎంటీవీ లాంటి ప్రముఖ మ్యూజిక్ చానల్స్ లో రోజులో ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే సాంగు ఇదే కావడం విశేషం. ఇది తమిళ పాటే అయినా 90శాతం ఇంగ్లీష్ లిరిక్స్ ఉండటంతో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ పాట ఓ ఊపు ఊపేస్తోంది.