కమ్యూనిస్టులను తాకిన ‘కొలవెరి’
రజనీకాంత్ అల్లుడు ధనుష్....తన భార్య దర్శకత్వంలో నటిస్తున్న '3' సినిమా కోసం స్వయంగా రాసి, పాడిన 'కొలవెరి' సాంగు బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాట దెబ్బకు ప్రధాని అతిథ్యం కూడా ధనుష్ కు లభించింది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ కొలవెరి ట్యూన్ తో పేరడీలు, అనుకరణలు ప్రారంభం అయ్యాయి. ఇక యూట్యూబ్ లో కొలవెరి పాట సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. భవిష్యత్ లో ఈ పాట రికార్డు అందుకోవడం కూడా చాలా కష్టమైన పనే.
తాజాగా కొలవెరి పాట....కమ్యూనిస్టులను కూడా తాకింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు గురువారం తమ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ 'కొలవెరి' కూడా జానపద పాటే అని చెప్పుకొచ్చారు. ఆ పాటను తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. తన పార్టీకి సంబంధించిన 'ఎత్తరా ఎర్రని పతాకం' అనే పుస్తకం ఆవిష్కరణలో రాఘవులు ఈ వ్యాఖ్యలు చేశారు.
ధనుష్ కొల వెరి పాట మూలంగా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వానికి, అల్లు ధనుష్ కు, 3 సినిమాకు, ఈ పాట కంపోజ్ చేసిన అనిరుధ్ కి భారీ పాపులారిటీ దక్కింది. ఒక్క పాట జీవితాలను మలుపు తిప్పడం అంటే ఇదేనేమో.


Click it and Unblock the Notifications











