రజనీ అల్లుడి పాటపై సునీల్ పేరడీ..
రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో రాబోతున్న '3' సినిమా కోసం 'కొలవెరి' పాట స్వయంగా రచించడంతో పాటు పాడిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ పాట యూట్యూబ్ లో భారతీయ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఇక ఈ పాటను బేస్ చేసుకుని రాజకీయ నాయకులపై పేరడీ సాంగులు, కామెడీ ట్రాక్ కూడా రూపొందించారు కొందరు.
టాలీవుడ్ విషయానికొస్తే....సునీల్ హీరోగా వస్తున్న 'పూల రంగడు' చిత్రంలో కొలెవెరి పాట ట్యూన్ ఆధారంగా ఓ పేరడీ సాంగు ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో ఈ పాట విని ప్రేక్షకులంతా కడుపుబ్బా నవ్వడం ఖాయమని సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం.
సునీల్, ఇషా చావ్లా జంటగా నటిస్తున్న పూలరంగడు చిత్రాన్ని...ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై 'అహనా పెళ్లంట' డైరెక్టర్ వీర భద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రేమ కావాలి చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన అనూప్ రుబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











