twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జైబోలోకు విరుగుడు కొలిమి: కెసిఆర్‌కు దర్శకుడు శంకర్ మస్కా

    By Srinivas
    |

    జైబోలో తెలంగాణ చిత్రంలో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంపై ఆయన తనపై గుర్రుగా ఉండటంతో దర్శకుడు శంకర్ మళ్లీ కెసిఆర్‌ను మచ్చిక చేసుకోవడానికి, ఆయన కోపం తగ్గించడానికి మరో ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. కెసిఆర్‌కు తనపై ఉన్న కోపాన్ని కొలిమి అనే చిత్రం ద్వారా తగ్గించుకునే ప్రయత్నం దర్శకుడు శంకర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కొలిమి అనే చిత్రాన్ని ప్రారంభించారు. దీనికి ట్యాగ్ లైన్‌గా రగులుతున్న తెలంగాణ అని పెట్టారు. అయితే జైబోలో చిత్రానికి పూర్తి విరుద్దంగా ఈ చిత్రంలో కెసిఆర్‌ను తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నేతగా చూపించే ప్రయత్నాలు శంకర్ చేసినట్టుగా తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జైబోలో తెలంగాణ చిత్రంలో తన ప్రాధాన్యతను తగ్గించడంపై శంకర్‌పై కెసిఆర్ సీరియస్ అయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి.

    తెలంగాణ ఉద్యమంలో పలువురి పాత్రతో పాటు కెసిఆర్ పాత్రను కూడా అందులో ఉంచారు. అయితే తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన తనకు మాత్రం ఆ సినిమాలో ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించలేదని కెసిఆర్ భావించారని సమాచారం. 2009లో తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రక మలుపు తిప్పిన తన నిరాహార దీక్షను శంకర్ జైబోలో తెలంగాణ చిత్రంలో పెట్టక పోవడంపై ఆయన అప్పడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఆ సినిమాలో తగ్గిన కెసిఆర్ ప్రాధాన్యతను కొలిమి చిత్రం ద్వారా పెంచాలనే ఉద్దేశ్యంలో భాగంగా మరో ఉద్యమ నేపథ్య చిత్రాన్ని శంకర్ తీస్తున్నట్లుగా సమాచారం. ఇది సోమవారం ప్రారంభమయింది. ఈ చిత్రాన్ని కెసిఆర్ టిఆర్ఎస్ భవన్‌లోనే ప్రారంభించారు. ఈ చిత్రం ముహూర్తం షాట్ కూడా కెసిఆర్ పైనే ఉండటం సినిమాలో కెసిఆర్‌కు ఉండే ప్రాధాన్యత సూచిస్తుంది. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న కెసిఆర్ బాటలోనే తాను పయనిస్తానని హీరో చెప్పిన మాటలను ముహూర్తపు షాట్‌గా చిత్రీకరించారు.

    English summary
    TRS president K Chandrasekhar Rao starts Kolimi film in TRS bhavan today. It seems, Kolimi is alternate to Shankar's Jai Bolo Telangana film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X