హీరో విశాల్‌కి కరోనా పాజిటివ్.. ఆయన వల్ల మరో ఇద్దరికి.. తీవ్ర జ్వరం
కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతోంది. సాధారణ జనాల నుంచి స్టార్ సెలబ్రెటీస్ వరకు ఈ వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నటుడు విశాల్ కుటుంబాన్ని కూడా కరోనా తాకింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి కరోనా ఉన్నట్లు విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ అభిమానులను షాక్ కి గురి చేస్తోంది.
Recommended Video

13లక్షల పాజిటివ్ కేసులు
దేశంలో ఇప్పటికే 13లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో ఒక చోట వైరస్ ముందు రోజుల కంటే మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఇక తమిళ నాడు కోవిడ్ 19 కేసులతో దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. ఇక రీసెంట్ గా హీరో విశాల్ కుటుంబం కూడా కరోనా భారిన పడింది.

క్లారిటీ ఇచ్చిన విశాల్..
ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చిన విశాల్.. ఇది నిజమే.. కోవిడ్-19 పరీక్షల్లో నాకు మా నాన్నకు పాజిటివ్ అని వచ్చిందని చెప్పారు. మా నాన్నకు సహాయకుడిగా ఉన్నందుకు నాకు కోవిడ్-19 సోకిందని చెబుతూ.. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో కొన్నిరోజులు ఇబ్బందిపడ్డానని చెప్పారు.

ఆ మెడిసిన్ వాడటం వల్ల..
ఇక తనతో ఉన్న మేనేజర్ కూడా ఈ వ్యాధి బారిన పడ్డాట్లు చెప్పిన విశాల్.. ఆయుర్వేద మెడిసిన వాడటం వలన కేవలం వారం రోజుల్లో డేంజర్ నుంచి బయటపడినట్లు వివరణ ఇచ్చాడు. మొత్తానికి ప్రమాదం నుంచి బయటపడి ప్రజంట్ మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాట్లు విశాల్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

వైరస్ అదుపులోకి రావడం లేదు
ప్రస్తుతం తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉంది. గత వారంలోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. అక్కడి వైద్య సిబ్బంది కూడా వ్యాధిని ఎంత అరికడుతున్నా కూడా అదుపులోకి రావడం లేదు. ఇక సినిమా సెలబ్రెటీస్ మొన్నటివరకు షూటింగ్స్ చేయాలని అనుకున్నప్పటికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలించకపోవడంతో కరోనా తగ్గే వరకు షూటింగ్స్ చేయకూడదని డిసైడ్ అయ్యారు.


Click it and Unblock the Notifications











