శ్రీలంక తమిళుల విరాళాల కోసం కోలీవుడ్, టాలీవుడ్ నటులు ఈ నెల ఏడున చెన్నైలో ప్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నట్లు తమిళ నటీనటుల సంఘం ఓ ప్రకటనలో తెలియచేసింది. కోలీవుడ్ జట్టులో శింబు, ఆర్యా, భరత్, శ్రీకాంత్, జీవా, రమణ, రితీష్, రమేష్ తదితరులు పాల్గొంటున్నారు. ఇక టాలీవుడ్ తరుపున శ్రీకాంత్, తరుణ్, ఉదయ్ కిరణ్, మిఖిల్, సాయిరవి, రాజీవ్ కనకాల, రఘు, ప్రభు తదితరులు ఆడతారు. ప్రస్తుతం కోలీవుడ్ జట్టు స్ధానిక జింఖాన క్లబ్ మైనానంలో ప్రాక్టీస్ చేస్తోంది.
Story first published: Wednesday, March 4, 2009, 15:07 [IST]