twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ పరిశ్రమలో మరో విషాదం: చికిత్స పొందుతూనే ప్రముఖ హాస్య నటుడు వివేక్ కన్నుమూత

    |

    కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కరోనా సమయంలో కన్నుమూశారు. చాలా మంది ఆ మహమ్మారి సోకి ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి సమయంలోనే పరిశ్రమకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ వివేక్ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంతో పరిశ్రమలో విషాదం అలముకుంది. ఈ గ్రేట్ కమెడియన్ మరణం పట్ల సినీ ప్రముఖులంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

     గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వివేక్

    గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వివేక్

    వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నారు కమెడియన్ వివేక్. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ (సిమ్స్)‌లో చేర్పించారు. అక్కడ నిన్నటి నుంచి ఆయనకు చికిత్స అందించారు వైద్యులు.

    నిన్న రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల

    నిన్న రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల

    వివేక్ ఆరోగ్య పరిస్థితిపై సిమ్స్ వైద్యులు గత రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అందులో 'వివేక్‌కు అక్యుట్ కరోనరీ సిండ్రోమ్ ద్వారా ఏర్పడిన కార్డియోజెనిక్ షాక్ వచ్చింది. పరీక్షల తర్వాత ఎమర్జెన్సీ కరోనరీ ఆంజియోగ్రామ్, ఏంజియోప్లాస్టీ చికిత్సను అందించాం. ప్రస్తుతం ఐసీయూలోని ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉంది' అని పేర్కొన్నారు.

    ఉదయం 5 గంటలకు కన్నుమూత

    ఉదయం 5 గంటలకు కన్నుమూత

    శుక్రవారం ఉదయం నుంచి పలు రకాల పద్దతుల్లో వివేక్‌కు సిమ్స్ వైద్యులు చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పులు కనిపించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైద్యులు మరింత మెరుగైన వైద్యం అందించినా.. శనివారం ఉదయం 5 సమయంలో వివేక్ కన్నుమూశారని తెలిసింది. దీంతో ఆయన అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

    కరోనా వ్యాక్సిన్ వల్లే అంటూ టాక్

    కరోనా వ్యాక్సిన్ వల్లే అంటూ టాక్

    వివేక్ గురువారమే కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. ఆ వెంటనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయాన్ని సిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్‌లో ప్రస్తావించారు. అక్యుట్ కరోనరీ సిండ్రోమ్ ద్వారా ఏర్పడిన కార్డియోజెనిక్ షాక్ వల్లే గుండెపోటు వచ్చిందని స్పష్టం చేశారు.

     సినీ ప్రముఖులు సంతాపం.. ట్వీట్లు

    సినీ ప్రముఖులు సంతాపం.. ట్వీట్లు

    దాదాపు మూడు దశాబ్ధాలుగా తమిళ చలన చిత్ర పరిశ్రమలో విశేషమైన సేవలు అందించడంతో పాటు తన హాస్యంతో ఎంతో మందిని నవ్వించిన వివేక్ మరణ వార్త యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. దీంతో ఆయన మృతికి సంతాపం తెలుపుతూ వివిధ ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులంతా ట్వీట్లు చేస్తున్నారు. ఫలితంగా మరణించిన తర్వాత ట్విట్టర్‌లో వివేక్ ట్రెండ్ అయ్యారు.

    Recommended Video

    Actor Vivek Biography, తన ధ్యేయం ఇదే , రూమర్స్ నమ్మొద్దు | RIP Vivek Sir | Filmibeat Telugu
    వివేక్ సినిమా కెరీర్ ఇలా సాగింది

    వివేక్ సినిమా కెరీర్ ఇలా సాగింది

    లెజెండరీ డైరెక్టర్ బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ కూడా ఒకరు. 'మనదిల్‌ ఉరుది వేండం' సినిమా ద్వారా ఈయన సినీ అరంగేట్రం చేశారాయన. ఈ క్రమంలోనే 300లకు పైగా చిత్రాల్లో నటించారు. మరీ ముఖ్యంగా కమల్ హాసన్, రజినీకాంత్, విక్రమ్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. లీడ్ రోల్‌లోనూ కొన్ని సినిమాలను చేసి అలరించారు వివేక్.

    English summary
    Vivekanandan, known by his stage name Vivek, is an Indian film actor, comedian, television personality, playback singer and activist working in the Tamil film industry. Introduced in films by director K. Balachander, he has won 3 times the Best Comedian – Tamil for his performances in movies such as Run, Saamy, Perazhagan and 5 times for Tamil Nadu State Film Award for Best Comedian as Unnaruge Naan Irundhal, Run Parthiban Kanavu, Anniyan and Sivaji. He has acted more than 220 films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X