అవకాశాల కోసం అంతకు దిగజారింది.. ఐదుగురిని?: ఒప్పుకున్న హీరోయిన్..

Recommended Video

అవకాశాల కోసం అంతకు దిగజారింది..ఐదుగురిని ఒప్పుకున్న హీరోయిన్..!

సినిమా అంటే రంగుల ప్రపంచం.. అవకాశాలు ఉన్నంత కాలం ఆ ప్రపంచానికి ఢోకా లేదు. కానీ అవకాశాలు సన్నగిల్లిన నాడు క్రమంగా ఆ ప్రపంచం మసకబారుతుంది. జీవితం రంగు వెలిసినట్లుగా అనిపిస్తుంది.

ఇక్కడే చాలామంది అడ్డదారులు కూడా తొక్కుతారు. అప్పటిదాకా అనుభవించిన లగ్జరీకి దూరమవడం ఇష్టం లేక.. డబ్బు సంపాదన కోసం ఎంతకైనా దిగజారుతారు. ఇలాగే అడ్డదారి తొక్కిన మరో వర్ధమాన నటి కూడా ఇప్పుడు జైలు పాలైన పరిస్థితి..

 ఎవరా నటి?:

ఎవరా నటి?:

'ఆడి పొన్ అవణి' అనే తమిళ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రుతి(21) అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వర్థమాన నటిగా తమిళ ఇండస్ట్రీలో ఆమె చాలామందికి సుపరిచితమే. కానీ అవకాశాల్లేక కెరీర్ ఢీలా పడ్డ తరుణంలో.. డబ్బు కోసం ఆమె అడ్డదారులు తొక్కింది.

 ఏం చేసింది?:

ఏం చేసింది?:

డబ్బు కోసం పలువురు యువకులకు మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా వలవేసింది. పెళ్లి పేరుతో వాళ్లకు దగ్గరైంది. ఎలాగూ కాబోయే భార్యే కదా.. అని ఆమె అడిగిన ప్రతీసారి వాళ్లు లక్షలకు లక్షలు సమర్పించుకున్నారు. అలా నలుగురైదురు యువకులను శ్రుతి మోసం చేసింది. తీరా అసలు విషయం తెలియడంతో ఆ యువకులు పోలీసులను ఆశ్రయించారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 జర్మనీ వ్యక్తిని బోల్తా కొట్టించి:

జర్మనీ వ్యక్తిని బోల్తా కొట్టించి:

సేలంకు చెందిన వ్యక్తి జి.బాలమరుగన్ వద్ద నుంచి రూ.41లక్షల మేర శ్రుతి కాజేసింది. జర్మనీలో ఓ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేసే అతనికి ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా శ్రుతి వల వేసింది. ఆ వెబ్ సైట్ లో ఏర్పడ్డ పరిచయంతో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి.

మైథిలి వెంకటేష్ పేరుతో..:

మైథిలి వెంకటేష్ పేరుతో..:

తన పేరు మైథిలి వెంకటేష్ గా పరిచయం చేసుకున్న శ్రుతి.. అతనితో పెళ్లికి కూడా అంగీకరించింది. దీంతో ఇరువురి కుటుంబాలు వధూవరుల జాతకాలు కూడా మార్చుకున్నాయి. ఇద్దరి జాతకాలు సరిపోవడంతో శ్రుతి కుటుంబం కూడా పెళ్లికి ఓకె చెప్పింది.

 పెళ్లి పేరుతో డబ్బు గుంజి..:

పెళ్లి పేరుతో డబ్బు గుంజి..:

పెళ్లికి ఓకె అయితే అంది కానీ ఎప్పుడు చేసుకుందామనే దానిపై మాత్రం శ్రుతి బాలమురుగన్ కు క్లారిటీ ఇవ్వలేదు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని వైద్య ఖర్చుల కోసం రూ.40లక్షలు కావాలని అతన్ని అడిగింది. ఎలాగూ కాబోయే భార్యే కదా అని నమ్మి.. అడిగినంత ఆమె ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేసేశాడు.

 ఇలా వెలుగులోకి:

ఇలా వెలుగులోకి:

శ్రుతి తన వద్ద నుంచి డబ్బు లాగుతున్నా బాలమురుగన్ కు ఆమెపై అనుమానం కలగలేదు. ఆ అమ్మాయి తనను మోసం చేయదని భావించాడు. కానీ ఓరోజు శ్రుతి ఫోటోను ఇండియాలో ఉన్న తన మిత్రుడికి చూపించడంతో.. ఆమె అసలు వ్యవహారం బయటపడింది.

అంతా అబద్దం..:

అంతా అబద్దం..:

శ్రుతి తల్లిదండ్రులమంటూ ఫోన్ ద్వారా మాట్లాడిన వ్యక్తులు.. అలాగే ఆమె సోదరుడు.. వీళ్లంతా ఫేక్ అని తేలింది. లేని కుటుంబాన్ని సృష్టించి శ్రుతి ఈ నాటకమాడింది. చెన్నై పోలీసుల విచారణలో ఈ నిజం బయటపడింది. బాలమురుగన్ ఫిర్యాదు మేరకు వారు దర్యాప్తు జరిపి హీరోయిన్ ను అరెస్ట్ చేశారు.

 గతంలోనూ ఇలాగే:

గతంలోనూ ఇలాగే:

హీరోయిన్ శ్రుతి మీద అంతకుముందే మరో కేసు కూడా రిజిస్టర్ అయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పెళ్లి పేరుతో గతంలోనూ ఓ అబ్బాయిని ఇలాగే మోసం చేసిందన్నారు. శ్రుతితో పాటు ఆమె తల్లిగా నటించిన మహిళ(47), తండ్రిగా నటించిన ప్రసన్న వెంకటేష్(37), సోదరుడిగా నిటించిన సుభాష్(19)లను పోలీసులు అరెస్ట్ చేశారు.

 అవకాశాలు లేకనే..:

అవకాశాలు లేకనే..:

ఇండస్ట్రీలో అవకాశాలు లేకనే ఈ పనిచేసినట్లు శ్రుతి తెలిపింది. తల్లి, సోదరుడి సహకారంతోనే ఈ పని చేశానని, విలాస వంతమైన జీవితానికి అలవాటు పడటంతో ఖర్చులు పెరిగాయని అంగీకరించింది. మొత్తం ఎనిమిది మందిని మోసం చేసినట్టు తెలిపింది.

 జాబితాలో సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్స్:

జాబితాలో సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్స్:

శ్రుతి చేతిలో మోసపోయినవాళ్లలో టెక్కీ అరుళ్ కుమార్, సంతోష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు.అలాగే సుందర్ అనే వ్యక్తి నుంచి కూడా శ్రుతి రూ.22లక్షలు గుంజింది. మొత్తం ఐదుగురు వ్యక్తుల్ని శ్రుతి మోసం చేసినట్లు సమాచారం. కేసు విచారణ దశలో ఉండటంతో మరిన్ని వివరాలు బయటపడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X