స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు కలకలం.. అర్ధరాత్రి భయాన్ని కలిగించిన వైనం..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో అర్ధరాత్రి హై డ్రామా నడిచింది. విజయ్ ఇంటిని భారీ సంఖ్యలో పోలీసులు మొహరించడంతో పరిసరాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మళ్ళీ విజయ్ ఇంటిని ఐటి అధికారులు ఏమైనా సోదాలు నిర్వహిస్తున్నారా అనే అనుమానం కలిగింది. కానీ అతని ఇంట్లోకి బాంబు కోసం సెర్చింగ్ జరుగుతోందని తెలియగానే అందరిలో ఒక ఆందోళన కలిగింది.

రిస్క్ చేయడం ఇష్టం లేక..
కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడులో స్టార్ హీరోలు పూర్తిగా బయటకు రావడం మానేశారు. విజయ్ కూడా సాలగ్రామంలోని తన ఇంట్లోనే గత మూడు నెలలుగా ఉంటున్నాడు. మాస్టర్ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు ఇంకా ఉన్నప్పటికీ రిస్క్ చేయడం ఇష్టం లేదని ఇంట్లోనే ఉంటున్నాడు.

బాంబు కలకలం..
ఈ క్రమంలో స్థానిక పోలీసులకు శనివారం అర్ధరాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది. విజయ్ ఇంట్లో ఒక బాంబును పెట్టారని ఒక వ్యక్తి భయపడుతూ చెప్పాడు. మీరు సరైన సమయానికి వెళ్లి కాపాడకపోతే అతని ప్రాణాలకు ముప్పని ఆ ఫోన్ కాల్ లో చెప్పడంతో పోలీసులు నిమిషం ఆలస్యం చేయకుండా విజయ్ ఇంటికి చేరుకున్నారు.

కంగారు పడాల్సిన అవసరం లేదని..
బాంబ్ స్క్వాడ్ తో విజయ్ ఇంటికి చేరుకున్న పోలీసులు సెర్చ్ చేశారు. పరిసర ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. అనంతరం విజయ్ కి వివరణ ఇచ్చిన పోలీసులు కంగారు పడాల్సిన అవసరం లేదని మీడియాకు తెలియజేశారు. అనంతరం ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని కనిపెట్టి ఆరా తీశారు.

ఫోన్ చేసింది ఎవరంటే..
కొన్ని నిమిషాల్లోనే ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు అతను విల్లుపురానికి చెందిన వ్యక్తి అని గుర్తించారు. అయితే అతను మానసికంగా ఎదగలేని వ్యక్తి అని తెలియడంతో కుటుంబ సబ్యులకు పోలిసులు హెచ్చరిక జారీ చేసి మరొకసారి ఇలాంటి పనులు చేయకుండా చూసుకోవాలని చెప్పారు.
Recommended Video

ఒకవేళ నిజమైతే..
గత నెల రజినీకాంత్ పో గార్డెన్ రెసిడెన్స్ లో కూడా బాంబు పెట్టారని ఒక వ్యక్తి ఇదే తరహాలో పోలీసులకు ఫోన్ చేసి ఆందోళన కలిగించాడు. అతనికి కూడా మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వలన అలా చేశాడని పోలీసులు కనుగొన్నారు. మరోసారి ఈ విధంగా కాల్స్ వస్తే.. కొన్నిసార్లు నిజమైనప్పుడు అబద్ధాలు అనుకునే ఆలోచన ఏర్పడకుండా ఉండదు. ఇలాంటి తప్పుడు కాల్స్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











