Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజినీకాంత్ ఇంటికి కరోనా భయం.. బయటకు వెళ్లకుండా ఆదేశాలు.. కూరగాయలు బ్యాన్!
కరోనా మహమ్మారి దూకుడికి ప్రపంచ దేశాలు ఇంకా కొలుకోలేకపోతున్నాయి. రోజురోజుకి వైరస్ విజృంభన ఉహీంచని స్తాయికి చేరుకుంటోంది. సాధారణ జనాలతో పాటి సెలబ్రెటీస్ కూడా వైరస్ భారిన పడుతున్నారు. ఇక ఇటీవల రజినీకాంత్ ఇంటిని కూడా కరోనా తాకినట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ కరోనా భయం సీరియస్ గా మారడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
Recommended Video
ఇంటికి కూడా వెళ్లలేదట..
రజినీకాంత్ చెన్నైలోని తన సొంత ఇంట్లో కాకుండా గత కొన్ని నెలలుగా ఇంటికి దూరంగా ఫార్మ్ హౌజ్ లోనే ఉంటున్నట్లు టాక్ వస్తోంది. లాక్ డౌన్ అనంతరం ఆయన ఇంటికి కూడా వెళ్లలేదని సమాచారం. అయితే ఇటీవల రజినీకాంత్ ఇంట్లో పని చేసే ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కలిశాడని..వార్తలు రాగా ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు.
రజినీకాంత్ ఆదేశాలు..
విషయం తెలుసుకున్న రజినీకాంత్ తన ఇంట్లో పని చేసేవారిలో కేవలం ఇద్దరిని మాత్రమే ఉంచారట. మిగతా వారిని ఎవరిని కూడా ఇప్పట్లో పనిలోకి రావద్దని నెలకు సరిపడా జీతం ఇంటికే పంపిస్తానని అన్నారట. అలాగే బయట కూరగాయలు కూడా కొనవద్దని ఫార్మ్ హౌక్ లో పండిస్తున్న కూరగాయలను ఇంటికి పంపుతున్నారట.
తమిళనాడులో భారీగా కరోనా కేసులు..
ప్రస్తుతం తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ ల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో రజినీకాంత్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరగడం లేదు. దేశంలోనే 78వేలకి పైగా కేసులతో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. దీంతో ముందు జాగ్రత్తగా సెలబ్రెటీస్ ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు.
షూటింగ్స్ క్యాన్సిల్..
రజినీకాంత్ ప్రస్తుతం సిటీకి దూరంగా ఉన్న ఫార్మ్ హౌజ్ లోనే సేదతీరుతున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఆయన మూడు సినిమాలకు కమిట్ అయ్యారు. డేట్స్ కూడా ఇచ్చినప్పటికీ కరోనా కేసులు పెరగడంతో మళ్ళీ క్యాన్సిల్ చేసుకోలేక తప్పలేదు. ఇక ఇప్పట్లో ఆయన షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.