Simbu: తీవ్ర ఆస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే!

తమిళ సీనియర్ నటుడు టీ రాజేంద్ర తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు అక్కడ స్టార్‌గా వెలుగొందుతున్నాడు హ్యాండ్సమ్ హీరో శింబు. చిన్న వయసులోనే తనదైన శైలి నటనతో మెప్పించిన అతడు.. ఇప్పటికీ తమిళ ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా యాక్టర్‌గా, సింగర్‌గా, కంపోజర్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. ఇంతటి పేరు ప్రఖ్యాతలతో కోలీవుడ్‌లోనే పేరున్న హీరోగా ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో శింబు తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

 ఫుల్ జోష్‌లో ఉన్న హీరో శింబు

ఫుల్ జోష్‌లో ఉన్న హీరో శింబు

కొంత కాలంగా సరైన బ్రేక్ లేక ఇబ్బందులు పడుతోన్న శింబు.. ఇటీవలే 'మానాడు' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది యాభై కోట్లకు పైగా వసూళ్లను కూడా అందుకుంది. ఈ విజయంతో శింబు, ఫ్యాన్స్ ఫుల్ జోష్‌తో ఉన్నారు. ఈ చిత్రాన్ని 'ది లూప్‌' పేరుతో తెలుగులోకి డబ్ చేశారు.

తీవ్ర అస్వస్థతకు గురైన శింబు

తీవ్ర అస్వస్థతకు గురైన శింబు

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్న తమిళ హీరో శింబు తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం 'వెందు తనిందదు కాడు' షూటింగ్‌లో పాల్గొన్న అతడు శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడిని సన్నిహితులు చెన్నైలోని ఆస్పత్రిలో చేర్పించారు.

అసలు శింబుకు ఏమైందంటే

అసలు శింబుకు ఏమైందంటే

ఈ మధ్య కాలంలో అస్సలు తీరిక లేకుండా సినిమాలు షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు శింబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం గౌతమ్ మీనన్ 'వెందు తనిందదు కాడు' షూటింగ్‌లో చాలా మంది ఆర్టిస్టులతో కలిసి చేస్తున్నాడు. దీంతో అతడికి ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తెలిసింది. ఈ కారణంగానే తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో బాధ పడ్డాడు. దీంతో శ్వాస తీసుకోవడం కుదలేదని అంటున్నారు.

కరోనా అన్న అనుమానంతోనే

కరోనా అన్న అనుమానంతోనే

జ్వరంతో పాటు జలుబు, గొంతు నొప్పి ఉండడంతో శింబుకు కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో అతడికి సాధారణ వైద్య పరీక్షలతో పాటు కోవిడ్ సంబంధించి టెస్టులు కూడా నిర్వహించారని తెలుస్తోంది. అయితే, అతడికి కరోనా నెగెటివ్ వచ్చిందని.. ఇది సాధారణ ఇన్ఫెక్షనే అని సన్నిహితులు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇంటికి వచ్చేసిన కోలీవుడ్ హీరో

ఇంటికి వచ్చేసిన కోలీవుడ్ హీరో

తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన శింబు.. వైద్య పరీక్షల అనంతరం ఇంటికి కూడా చేరుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు మహత్ రాఘవేంద్ర ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 'శింబు కోసం ప్రార్థించిన వాళ్లకు ధన్యవాదాలు. అతడికి వచ్చింది వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే. ఇంటికి కూడా తిరిగి వచ్చేశాడు' అంటూ అతడు ట్వీట్ చేశాడు.

తెలుగు వాళ్లకు సుపరిచితుడే

తెలుగు వాళ్లకు సుపరిచితుడే

తమిళంలో స్టార్‌ అయిన శింబు.. తెలుగు వాళ్లకు కూడా బాగా సుపరిచితుడు అయ్యాడు. గతంలో అతడు నటించిన 'వల్లభ', 'మన్మధ' వంటి ప్రేమకథా చిత్రాలు మన దగ్గర కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాగే, అతడు మంచు మనోజ్ 'పోటుగాడు', జూనియర్ ఎన్టీఆర్ 'బాద్‌షా' వంటి చిత్రాల్లో పాటలు కూడా పాడాడు. ఇలా రెండు భాషల్లో పేరు అందుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X