మహేష్ నిర్మాతలతో కోలీవుడ్ స్టార్ హీరో డైరెక్ట్ తెలుగు మూవీ!
టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి మెల్లమెల్లగా తెలుగు ఆడియెన్స్ కి కూడా దగ్గరవుతున్నాడు. కోలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ తెలుగులో కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నారు. ఉప్పెన సినిమాలో ఈ సీనియర్ యాక్టర్ విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
హీరోగానే కాకుండా విలన్ గా కూడా విజయ్ సేతుపతి మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమే అంటున్నాడు. సైరా సినిమాలో ఒక సపోర్టింగ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే.. మహేష్ బాబుతో శ్రీమంతుడు లాంటి బాక్సాఫీస్ హిట్ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం సర్కారు వారి పాట అనే కొత్త సినిమాను కూడా నిర్మిస్తోంది.

అయితే ఆ నిర్మాతలతో కలిసి విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడట. ఆ సినిమా పూర్తిగా తెలుగులోనే తెరకెక్కనుందట. సుకుమార్ శిష్యుడు చెప్పిన ఒక కొత్త కథకు మైత్రీ నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. విజయ్ సేతుపతి కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఇక ఇన్నాళ్లకు సరైన కథ దొరకడంతో నెక్స్ట్ ఇయర్ ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











