twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిలికి చిలికి గాలివానలా.. సారంగ దరియాపై సుద్దాల అలా.. కోమలి ఇలా!

    |

    సినిమా చుట్టూ వివాదాలు చుట్టుకోవడం కొత్తేమీ కాదు. కొన్ని సార్లు కాపీ మరకలతో అప్రతిష్ట పాలు కావాల్సి వస్తుంది. కథ, కథనం, సంగీతం, పాటలు ఇలా ఎన్నింట్లోనో కాపీలు జరుగుతుంటాయి. ఎక్కడో ఎవరో రాసిన పాడిన పాటలను కొందరు వాడేసుకుంటారు. అలా పాటల రచయితల మీద కాపీ ముద్ర పడుతుంటుంది. ఇంకెక్కడ ఎవరో కొట్టిన బీట్‌ను తీసుకొచ్చి యథాతథంగా వాడుతుంటారు. తాజాగా లవ్ స్టోరీ సినిమాలోని ఓ పాట చుట్టూ ఇప్పుడు వివాదం చెలరేగుతోంది.

    సారంగ దరియా అంటూ..

    శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్‌లో సినిమా అంటే అందరూ మళ్లీ ఫిదా రేంజ్‌ను ఆశిస్తుంటారు. సాయి పల్లవి అంటేనే అదిరిపోయే పాటలు, స్టెప్పులు ఉండాలి. అందుకు తగ్గట్టు లవ్ స్టోరీ సినిమాలోనూ ఓ జానపద గేతాన్ని పెట్టాలని చూశారు. అలా లవ్ స్టోరీ సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ సారంగ దరియా అనే పాటను వాడేశాడు.

    రేలారేలారే..

    రేలారేలారే..


    మా టీవీలో అప్పుడెప్పుడో వచ్చిన రేలారేలారే జాన పద పాటల కార్యక్రమంలో కోమలి అనే గాయని సారంగ దరియా పాటను పాడింది. కోమలి అంటే సారంగ దరియా అని అందరికీ తెలిసిందే. అయితే ఆమె పాటను ఇలా లవ్ స్టోరీ సినిమా కోసం వాడేయడంతో అసలు చిక్కు వచ్చింది. ఆమె సేకరించి పాడిన పాటను ఇలా ఆమెకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా వాడేయడంతో అసలు సమస్య వచ్చింది.

    సారంగదరియా ప్రోమో..

    సారంగదరియా ప్రోమో..

    సారంగ దరియా పాటకు సంబంధించిన ప్రోమో వచ్చాక.. ఈ విషయం తెలిసింది.. ఆ తరువాత శేఖర్ మాస్టర్, సుద్దాల అశోక్ తేజ ఫోన్ చేశారు. పాడతావా? అని అడిగారు.. కానీ గొంతు బాగా లేదు ఓ పది రోజులు టైం ఇవ్వండని అడిగితే.. ఆల్రెడీ టైం దగ్గరపడిందని చెప్పుకొచ్చారు. ఆడియో ఫంక్షన్‌లో పాడిస్తాం.. తరువాతి సినిమాల్లో చాన్స్ ఇస్తామని శేఖర్ కమ్ముల అన్నారని కోమలి చెప్పుకొచ్చింది.

    కనీసం క్రెడిట్..

    కనీసం క్రెడిట్..


    జానపదం అందరిదీ.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు అని సుద్దాల గారు అంటున్నారు. అవును అది నిజమే.. కానీ నేను మొదటగా కూర్చి పాడాను.. సేకరించాను కాబట్టి అది నాదే.. నేనే ఆ పాట పాడాలి.. కనీసం నాకు క్రెడిట్ అయినా ఇవ్వలేదంటూ కోమలి తన బాధను చెప్పుకొచ్చింది.

    ఆమె పాడింది బాగా లేదు..

    ఆమె పాడింది బాగా లేదు..


    మంగ్లీ గొంతులో ఆ ఫోక్ దనం కనిపించలేదు.. ఆమె పాడిన పాట ఏమీ బాగాలేదు.. నాకు నచ్చలేదు.. జనాలు కూడా అదే అంటున్నారు.. మళ్లీ కోమలినే పాడాలి అని కోరుకుంటున్నారు.. క్రెడిట్ ఇచ్చినా ఇవ్వకున్నా.. చివరకు వినిపించేది ఆ గొంతే కాబట్టి.. ఆ పాట నేనే పాడాలి అంటూ కోమలి చెప్పుకొచ్చింది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో చూడాలి.

    English summary
    Komali About Suddala ashok teja saranga dariya song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X