'కొమరం భీమ్' చిత్రం రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

By Srikanya

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 1935-40 సంవత్సరాల మధ్య జరిగిన గిరిజనుల హక్కుల పోరాటంఇతివృత్తంగా రూపొందిన చిత్రం 'కొమరం భీమ్'. ఈ చిత్రం జూలై 2న విడుదల కాబోతోంది. కొమురం భీమ్ గా భూపాల్‌రెడ్డి నటించగా దర్శకుడు అల్లాణి శ్రీధర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ ఘోష్ సంగీతం సమకూర్చడం మరో విశేషం. గిరిజన సంక్షేమశాఖ సహకారంతో ఎఫ్.డి.సి., కొమరం భీమ్ ఫౌండేషన్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

సినిమా గురించి దర్శకుడు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ...గోండు గిరిజనుల్ని చైతన్యవంతం చేసి, ఆనాటి నిరంకుశ ప్రభుత్వాన్ని గడగడలాడించిన పోరాట వీరుడు కొమరం భీమ్. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవి బిడ్డల కష్టాల్ని అనుభవించిన ఓ అమాయక గిరిజనుడు సహజ పరిణామక్రమంలో మహానాయకుడై ఎదిగి ఆనాటి అణచివేతపై తిరగబడి చరిత్రలో అమరవీరుడిగా, ఆదర్శప్రాయుడిగా, చిరస్మరణీయుడిగా నిలిచిన చారిత్రక కథనమే ఈ సినిమా. కొమరం భీమ్ ఇలాగే ఉంటాడేమో అన్నట్లుగా ఆ పాత్ర పోషణ చేశారు భూపాల్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X