twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెట్లో పులి పాటలు?

    By Staff
    |

    Puli
    పవన్ కళ్యాణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కొమురం పులి చిత్రం ఆడియో అప్పుడే నెట్లో సందడి చేస్తోందనే టాక్ అంతటా వినిపిస్తోంది. ఇవాళ రేపు...పెద్ద సినిమాలకు పైరసీ పెద్ద శాపం అయిపోయింది. అయితే ఆడియో రిలీజ్ కాకముందే పాటలు నెట్ లో ఉంటే..ఏమిటి పరిస్ధితి అన్నది ఎవరికీ అర్ధం కావటం లేదు. కొద్ది రోజుల క్రితం మిత్రుడు ఆడియో రిలీజ్ కాకమునుపే నెట్లో ఉందని నిర్మాత మీడియా మీట్ పెట్టి గోలెత్తారు. అలాగే పవన్ జల్సా సమయంలోనూ జల్సా టైటిల్ సాంగ్ నెట్లో ముందే దర్శనమిచ్చింది. అయితే అనఫీషియల్ ప్రచారం కోసం క్రేజ్ రేవటం కోసం సినీ వర్గాలే ఈ పని చేస్తుండవచ్చనుననేది ఓ వాదం వినపడుతోంది. అయితే తమ హీరో సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అబిమానులు ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఉండటమే ఈ సమస్యకు పరిష్కామంటున్నారు. అయితే పులి లో తాము విన్న పాట చాలా బాగుందని వినపడటం ఓ ప్లస్ పాయింటు కూడా.

    అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ పులి చిత్రంలో పవన్ తొలిసారిగా ద్వి పాత్రలలో కనిపించనున్నారు. అందులో పోలీసాఫీసర్‌ పాత్ర ఒకటి. పవన్ కెరీర్ లో బెస్ట్ గా నిలిచిన "ఖుషి" చిత్రాన్ని అందించిన ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించనున్నాడు. దాదాపు యేడేళ్ళ తరువాత మళ్ళీ కలిసిన ఈ కాంబినేషన్ పై చాలా అంచనాలు ఉన్నాయి. "ఖుషి" సినిమా పవన్ కెరీర్ పై ఎంతగా ప్రభావం కలిగించిందంటే అభిమానులు ఆ తరువాత ఎన్ని సినిమాలు వచ్చినా దాంతో పోల్చుకుని ఆ రేంజ్ లో ఊహించుకుని పెద్దగా వాటిని ఆదరించలేదన్నది నిజం.

    అలాగే పవన్ కూడా "ఖుషి" తరహా మేనరిజమ్స్ ని స్టైల్స్ ని కంటిన్యూ వదలక చేస్తూనే ఉన్నాడు. ఆ తరువాత వచ్చిన ప్రతీ సినిమాలో ఆ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. దాంతో ఇంతలా సింక్ అయిన ఈ కాంబినేషన్ పై అందరి కళ్ళూ ఉన్నాయి. గ్యారింటీ హిట్ అన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ నిర్మిస్తున్నాడు.లండన్ కు చెందిన మోడల్ నికిష ఈ చిత్రం ద్వారా హీరోయన్ గా పరిచయమవుతోంది. జూలై నెలాఖరు వరకూ జరిగే తాజా షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందనీ, మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయనీ యూనిట్ వర్గాల సమాచారం. ఆగస్టులో సినిమా రిలీజ్ కు దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మనోజ్ బాజ్ పాయి, చరణ్ రాజ్, శరణ్య, నాజర్, ఆలీ తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్, ఆనందసాయి కళాదర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X