అల్లు అరవింద్ చొరవతో ముగిసిన కొమరం పులి వివాదం
పవన్ కళ్యాణ్ హీరో నటించిన కొమరం పులి వివాదం ముగిసింది. కొమరం పులి పేరు మార్చాలని నిజాంపై పోరాటం చేసిన కొమరం భీం మనవడు సోనీరావు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పేరు మార్చకపోతే తెలంగాణలో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. అయితే, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బావ మరిది, నిర్మాత అల్లు అరవింద్ చొరవతో వివాదం పరిష్కారమైంది. సోనీరావుతో అల్లు అరవింద్ కుదిర్చిన ఒప్పందం ఏమిటో తెలియదు గానీ కొమరం పులి విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. కొమరం పులి సినిమాను ఈ నెల 10వ తేదీన గానీ 11వ తేదీన గానీ విడుదల చేయవచ్చునని తెలుస్తోంది. మొదటి నుంచి వివాదాల్లో చిక్కుకున్న కొమరం పులి దాదాపుగా అన్ని అడ్డంకులు దాటుకుంటూ వచ్చింది.


Click it and Unblock the Notifications











