ఆ పేపరుకీ, పవన్ కళ్యాణ్ కీ తగువుంది కాబట్టే...
నేను..పవన్ కళ్యాణ్ కి, ఎస్.జె.సూర్యకీ వ్యతిరేకంగా మాట్లాడినట్లు..నా మాటల్ని వక్రీకరించి ఆ ఆగ్ల పత్రిక డక్కన్ క్రానికల్ వారు ప్రచురించారు. అయితే అది పవన్ కళ్యాణ్ కీ, క్రానికల్ వారికీ మధ్య ఉన్న సమస్య వల్ల వచ్చిందనుకుంటున్నాను. అందుకే నేను చెప్పిందాన్ని ట్విస్ట్ చేసి దక్కన్ క్రానికల్ పేపర్ లో ప్రచురించారు అంటూ వాపోతోంది ట్విట్టర్ లో నిఖిషా పటేల్. పులి హీరోయిన్ అయిన ఈమె..రెండు రోజుల క్రితం దక్కన్ క్రానికల్ పత్రికల వారితో పులి చిత్రం వల్ల తన కెరీర్ పాడయినట్లు మాట్లాడినట్లు వచ్చింది. అయితే అదంతా ఆ పేపర్ కావాలని సృష్టించిందని మీడియాపై మండిపడుతోందామె. అలాగే తాను ఇప్పటికీ పవన్ తో పనిచేయటం చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు, తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా ఇన్నింగ్స్ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్తోంది. ఏది నిజమో..ఏది అబద్దమో పేపరువారికీ, నిఖిషా పటేల్ కీ తెలియాలి.


Click it and Unblock the Notifications











