అంత భాదనిపిస్తే 'పులి' సినిమా చూడొద్దు...అల్లు శిరీష్
త్వరలో విడుదల కానున్న పవన్ కళ్యాణ్ కొమురం పులి చిత్రం టిక్కెట్ రేట్లు పెంచే ఆలోచనలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఓ పవన్ కళ్యాణ్ అభిమాని అల్లు శిరీష్ కి ట్వీట్ చేస్తూ...టిక్కెట్ రేట్లు 75 రూపాయలు చేసి సంపాదించి ఏమి చేస్తారు...పవన్ అన్నయ్య సినిమా అంటే మినిమం గ్యారెంటీ కదా అని స్పందించారు. దానికి అల్లు శిరీష్ సమాదానమిస్తూ..ఇలాంటి రబ్బిష్ న్యూస్ ఎక్కడ నుంచి వచ్చింది. అయినా నీ డబ్బు స్టోలిన్(దొంగలింపబడుతోంది) అని ఫీలయితే సినిమాని చూడకు అని ఘూటుగా సమాధానమిచ్చాడు.
ఇక పులి పోగ్రెస్ వివరిస్తూ..నిన్న మధ్యాహ్నం నుంచి ఎ.ఆర్.రహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రారంభించారు. సెప్టెంబర్ మూడు లేదా నాలుగుకి ఇది పూర్తవుతుంది. అలాగే సినిమా ఫస్ట్ హాఫ్ డిటిఎస్ మిక్సింగ్..కూడా ప్రారంభమయింది. సెప్టెంబర్ 8 కల్లా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులూ పూర్తవుతాయి. ఇది మా మాట కాదు ప్రొడ్యూసర్ ది. ఇక మేము గీతా ఫిల్మ్ తరపున బెస్ట్ స్క్రీన్ ని పులి కోసం రెడీ చేస్తున్నాము. అలాగే కొమురం పులి...గీతా ఆర్ట్స్ ఫిల్మ్ కాదు. కేవలం గీతా ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోందంతే. ఫ్యాన్స్ ఈ విషయం అర్ధం చేసుకోవాలి. మా పని ప్ర్రారంభమయ్యేది ప్రింట్స్ మా చేతికొచ్చాకే అని ట్విట్టర్ లో రాసారు. శింగనమల రమేష్ నిర్మిస్తున్న పులి చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











