పవన్ కళ్యాణ్ కొమరం పులి లేటెస్ట్ ఇన్పర్ మేషన్...!
రెండు సంవత్సరాల నుంచి ఎప్పడెప్పడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అందని ద్రాక్ష మాదిరే ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. ఇటీవల కొమరం పులి సినిమాని నిర్మాత సెప్టెంబర్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని రెండు రోజులు అవ్వక ముందే సినిమాని మరలా ప్రోలాంగ్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో. సెప్టెంబర్ 12నాటికి ఈ చిత్రం మొట్టమొదటి కాఫీ రెడి అవుతుందని, ఆ తర్వాత వెయ్యి ప్రింట్లు వేయాల్సి ఉంటుందని, చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఉండడంతో ఈ చిత్రాన్ని, సెప్టెంబర్ 15 వ తారీఖు విడుదల చేసి ఫస్టు వీక్ లోనే తోమ్మిది రోజుల షేర్ ని రాబట్టేలా మెగా ప్రోడ్యూసర్ అల్లు అలవింద్ గారు ప్లాన్ చేశారని టాలీవుడ్ వర్గాల భోగట్టా. అంతేకాకుండా గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూసన్ ద్వారా విడుదల కానున్న కోమరం పులి కోసం టికెట్ రేట్లు పెంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదికూడా ఆలస్యానికి ఒక కారణం అంటున్నారు.ఏది ఏమైనా కోమరం పులి త్వరగా రిలీజ్ అవ్వాలని, అంతక ముందున్న పాత రికార్డుల్ని బద్దలు కోట్టాలని ఆయన ప్రతి అభిమాని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











