పైరసీ ని ప్రోత్సహించే దిశలో పవన్ 'కొమురం పులి'?
పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య కాంబినేషన్ లో రెడీ అయి త్వరలో రిలీజ్ కానున్న కొమురం పులి చిత్రం ఎఫెక్టుతో టిక్కెట్ రేట్లు పెంచటానికి ఎపి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ రెండవ వారం నుంచి అమలులోకి వచ్చే ఈ జీవో ప్రకారం..పది రూపాయల టిక్కెట్టు పాతిక, యాభై రూపాయల టిక్కెట్టు 75 అవుతుంది. కొమరం పులి చిత్రంలో ఈ టిక్కెట్టు రేట్లు పెరుగుతాయి. అయితే ఇలా చేయటం వల్ల తాత్కాలికంగా ఫలితం కనిపించినా పైరిసీ బాగా పెరుగుతుని నిపుణులు అంటున్నారు. పెద్ద హీరో చిత్రం చూడాలని అందరికీ ఉంటుందని, అయితే రేట్లు అందుబాటులో లేకపోతే గ్యారింటీగా పైరిసీని ఎంకరేజ్ చేస్తాడని అంటున్నారు. అలాగే పెద్ద నిర్మాతలు వారం లోగా హిట్టు, ప్లాప్ లతో సంభందం లేకుండా తమ డబ్బుని రికవరి చేసుకునే అవకాశం కల్గిస్తుంది కానీ, ఓ మాదిరి చిత్రాన్ని ఈ రేటుతో చూడ్డానికి ఎవరూ రాక ఇప్పటికే చితికి పోయిన చిన్న చిత్రాలు కాన్సెప్టు పూర్తిగా నాశనమవుతుందనేది నిజం. ఇక కొమురం పులి చిత్రం సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











