పవన్ కళ్యాణ్ పాత్ర పేరుకి తగ్గట్టే...
పవన్ కళ్యాణ్ పాత్ర పేరుకి తగ్గట్టే పులిలా ఉంటుంది. ఆయన పాత్ర, నటన, కథ తప్పకుండా కొత్త చరిత్రను సృష్టిస్తాయని చెప్పగలను. ప్రేక్షకుల అంచనాలకు తగ్గ విధంగా తీర్చిదిద్దుతున్నానని పులి చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య అన్నారు.ఆయన ఈ చిత్ర విశేషాలు తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...'ఖుషి' లాంటి సూపర్‌హిట్ తర్వాత మా ఇద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. అభిమానులు, ప్రేక్షకులు పవన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని అంశాలు ఇందులో వుంటాయి. 'కొమరం పులి'గా ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా వుంటుంది' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ...-"బ్యాలెన్స్ సాంగ్‌ను ఈ నెల 25 నుంచి చిత్రీకరిస్తాం. 'కొమరం పులి'గా పవన్ నటన చిత్రానికి మెయిన్ హైలైట్. ఈ కథ విన్న ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం ఆయన రీ-రికార్డింగ్‌ని లండన్‌లో చేస్తున్నాడు. పూర్తి వాణిజ్య అంశాలతో, అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా తప్పకుండా తెలుగు సినిమా స్టాండర్స్‌ని పెంచే విధంగా వుంటుంది అన్నారు. నికీషా పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మనోజ్ బాజ్ పాయ్, నాజర్, చరణ్ రాజ్, అలీ, బ్రహ్మాజి, జ్యోతికృష్ణ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: బినోద్ కె.ప్రధాన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, సమర్పణ: సత్యరామమూర్తి.


Click it and Unblock the Notifications











