కొమరం పులి రిలీజ్ నిమిత్తం నిర్మాతలు హైకోర్టుకు హామీ
'కొమరం పులి' సినిమాను బ్యాంకు గ్యారంటీ సమర్పించిన తర్వాతే విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాతలు మద్రాసు హైకోర్టుకు హామీ ఇచ్చారు. చెన్నైలోని రవిప్రసాద్ యూనిట్ దాఖలు చేసిన సివిల్‌సూట్ విచారణలో భాగంగా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎస్.రాజేశ్వరన్ సమక్షంలో కనకరత్న మూవీస్ చిత్ర నిర్మాతల తరఫున లాయరు ఈ మేరకు హామీ ఇచ్చారు. రవిప్రసాద్ యూనిట్‌కు కనకరత్న మూవీస్ ప్రతినిధి ఎస్.రమేష్ బాబు రూ.1.84 కోట్ల మేరకు బకాయిపడ్డారు. వీటిని చెల్లించకుండా 'కొమరం పులి' విడుదల చేయరాదని రవిప్రసాద్ యూనిట్ మద్రాసు హైకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు. మరో ప్రక్క పవన్ కళ్యాణ్, నిఖిషా పటేల్ కాంబినేషన్ లో ఎస్.జె.సూర్య రూపొందిన ఈ చిత్రాన్ని ఖచ్చితంగా ముందే చెప్పినట్లుగా సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











